Superstar Krishna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో శకం ముగిసింది. నట శేఖరుడు కృష్ణ అనారోగ్యం కారణంగా నవంబర్ 15 తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణ మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇక చిరంజీవి అయితే కృష్ణ లేరని తెలిసి కన్నీరు కూడా పెట్టుకున్నారు. అంతక ముందు చిరంజీవి తన సోషల్ మీడియాలో ఇది నిజంగా మాటలకు అందని విషాదం . సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు.
కృష్ణకి వీరాభిమాని..
అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. కృష్ణ సినిమాలని స్పూర్తిగా తీసుకొని చిరు ఇండస్ట్రీలోకి వచ్చినట్టు చెబుతుంటారు. కృష్ణ సినిమాలు చూసి మద్రాస్ రైలు ఎక్కానని అప్పట్లో పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరంజీవి కృష్ణ కాంబినేషన్‌లో `కొత్తల్లుడు`, `కొత్త పేట రౌడీ`, `తోడు దొంగలు` చిత్రాలు రాగా, అవి మంచి విజయాలను అందుకున్నాయి. అయితే వీటిలో కీలక పాత్రల్లోనే చిరు నటించగా, `కొత్తల్లుడు`లో చిరు నెగటివ్ రోల్ చేయడం విశేషం. స్నేహం కోసం చిత్రంలో కూడా కృష్ణ నటించాల్సి ఉండగా, పలు కారణాల వల వెనకడుగు వేశారు. ఇక కృష్ణని చిరు వ్యక్తిగతంగాను చాలా ఇష్టపడేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణకు 2,500 అభిమాన సంఘాల ఉండగా, పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో ఉన్న అభిమాన సంఘానికి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడిగా ఉన్నారు. తోడు దొంగలు సినిమా విడుదలయిన సందర్భంలో చిరంజీవి విడుదల చేసిన కరపత్రం ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌చేస్తుంది. ఇది చూసి అందరు అవాక్కవుతున్నారు
also read news:
హీరోయిన్‌తో ప్రేమ,పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చిన క్రికెటర్