Homecinemakrishna veelunama : కృష్ణ వీలునామా.. ఆస్తి మొత్తం ఎవరి పేరున రాశాడో తెలుసా ?

krishna veelunama : కృష్ణ వీలునామా.. ఆస్తి మొత్తం ఎవరి పేరున రాశాడో తెలుసా ?

Telugu Flash News

krishna veelunama : ఒకప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తిరుగు లేని స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు న‌ట శేఖ‌ర కృష్ణ‌. ఆయ‌న‌కి కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్సనందించారు. కాని రాను రాను ఆయ‌న ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా మారి క‌న్నుమూసారు.

కృష్ణ మ‌ర‌ణంతో సినీ ఇండ‌స్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే అప్పట్లో గ్రామాలకు గ్రామాలు బండ్లల్లో బయలుదేరేవారట. అంత పాపులారిటీ దక్కిన కృష్ణ ఆర్థికంగా అపర కుబేరుడిగా ఎదిగి ఉండాలి, కాని అలా కాలేదు.

ఒకే సంవత్సరంలో 24సినిమాలు విడుదల చేయటం, ఒకే రోజులో నాలుగు సినిమా షూటింగ్స్ లో పాల్గొనటం, తన సొంత బ్యానర్ నుండి వరుసగా సినిమాలను నిర్మించటం ఇలా సినిమానే ఊపిరిగా బ్రతికిన కృష్ణ ఆర్ధికంగా మాత్రం అంత ఎద‌గ‌లేక‌పోయారు.

ఆస్తుల విలువ

కృష్ణ క్రేజ్‌కి, ఆయన సంపాదించిన ఆస్తులకి మాత్రం ఎక్కడ పోలిక లేదు. మనీ విష‌యంలో ఆయ‌న చాలా అమాయ‌క‌త్వంగా ఉండేవారు. సూపర్ స్టార్ కృష్ణ సంపాదించిన మొత్తం ఆస్తుల విలువ 400 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా.

తన స్వంత గ్రామం బుర్రిపాలెంలో, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కృష్ణ పేరిట కొన్ని ఇళ్ళు ఉన్నాయి. అలాగే ప‌లు ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి. కృష్ణ గ్యారేజ్ లో మొత్తం 20 కోట్ల విలువ చేసే 7 కార్లు ఉన్నట్లు స‌మాచారం. సెటిల్మెంట్స్, భూముల కొనుగోళ్లు, సైడ్ బిజినెస్ వంటి వాటిలో కృష్ణ ఏనాడు ఆస‌క్తి చూప‌లేద‌ట‌.. నిత్యం సినిమాలు నిర్మిస్తూ .. సినిమానే ప్రపంచంగా ఉండేవాడట‌.

ఒకానొక స‌మ‌యంలో వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో కృష్ణకి కోట్లాది రూపాయలు నష్టం వచ్చిందని.. ఆ సమయంలో అప్పులు తీర్చేందుకు తన పద్మాలయ స్టూడియో అమ్మేయాలని కృష్ణ భావించిన‌ట్టు స‌మాచారం.

-Advertisement-

అయితే అంతలోనే మహేష్ బాబు టాలీవుడ్‌లో నిలదొక్కుకొని, తండ్రి చేసిన అప్పుల‌న్నీ తీర్చేశాడ‌ట‌. కృష్ణ డబ్బును ఏనాడూ లెక్క చేయలేదు. రెమ్యునరేషన్ పెద్ద మేటర్ గా చూసేవారు కాదు. హీరోగా తన ఫస్ట్ మూవీ తేనె మనసులు కి కృష్ణ రెమ్యూనరేషన్ రూ. 2000లు మాత్ర‌మే తీసుకున్నార‌ట. 30 సినిమాల వరకూ కూడా కృష్ణ రూ. 5000 కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదని స‌మాచారం.

పద్మాలయా స్టూడియోతో పాటు కృష్ణ పేరిట పలు స్థిర చర ఆస్తులు ఉండ‌గా, ఈ ఆస్తి మొత్తం ఎవరికి చెందాలో వీలునామాలో కృష్ణ రాశారట. ఆయన తన మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా తన ఆస్తి చెందాలని వీలునామాలో రాసుకురాగా, స్టెప్ సన్ నరేష్ కి మాత్రం ఆస్తిలో భాగం ఇవ్వలేదని సమాచారం.

అయితే నరేష్ తల్లి విజయనిర్మల కోట్లు సంపాదించ‌గా, త‌ను కూడా కృష్ణ ఆస్తి నుండి ఏమి ఆశించ‌లేద‌ని తెలుస్తుంది.

also read news:

Bigg Boss 6: బిగ్ బాస్ ట్విస్ట్‌లు మాములుగా లేవు.. మ‌నీ కోసం ఫైమా ప‌త్తి ఏర‌డానికి వెళ్లిందా…

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News