Bigg Boss 6: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత రసవత్తరంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం.చివరిగా నామినేషన్ ప్రక్రియ జరగగా, అందులో కెప్టెన్ ఫైమా తప్ప అందరు నామినేట్ అయ్యారు. అయితే వారిలో ఒకరు నామినేషన్ నుంచి సేవ్ కావొచ్చు అంటూ పెద్ద ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్.
నామినేషన్లలో ఉన్న సభ్యులకు చెక్కులిస్తూ, ఒక లక్ష నుంచి, ఐదు లక్షల వరకు చెక్‌పై రాయాలని, ఎక్కువ రాసిన వారు ఇమ్మూనిటీ పొందుతారని, అంతేకాక ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారని తెలిపారు. ఇందులో శ్రీ సత్య, కీర్తి, రేవంత్ ఒక్కరూపాయి తక్కువ ఐదు లక్షలు చెక్‌పై రాశారు. ఇక రేవంత్, కీర్తిలు రాసిన అమౌంట్ సేమ్ ఉండటంలో ఒకే అమౌంట్‌ని ఇద్దరు రాయోద్దని, అలా రాస్తే కన్సిడర్ చేయమని బిగ్ బాస్ అన్నారు.
ఇనయ, మెరీనాలు రాశారు రెండు రూపాయలు తక్కువ రాయగా, వీరిది కూడా చెల్లలేదు. ఇక అత్యధిక అమౌంట్ రాసిన రాజ్ విన్నర్ అయ్యారు. ఆయన నాలుగు లక్షల 99వేల 700 రూపాయలు రాశారు. దీంతో విన్నర్‌గా నిలిచిన అతను ఈ వారం ఇమ్యూనిటీ పొంది నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు.
ఇక విన్నింగ్ అమైంట్ యాభై లక్షల నుంచి ఐదు లక్షలు లాస్ జరగుతుంది,. కాబట్టి వాటిని కాపాడుకునేందుకు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నిర్ణీత టైంలో వంద పరుగులు చేయాలి. రేవంత్, రోహిత్ పరుగులు చేయలేకపోవడంతో రేస్ నుండి తప్పకోవలసి వచ్చింది. దీంతో లక్ష లాస్ ఏర్పడింది.
డబ్బు ప్రాధాన్యత గురించి చెప్పమని బిగ్ బాస్ ఆదేశిండంతో ఒక్కొక్కరు తమ విషాద గాథలను చెప్పుకున్నారు. ఫైమా మనీ కోసం పత్తి ఏరడానికి కూడా పోయానని చెప్పింది.హైదరాబాద్ వచ్చాక కిరాయి ఇంట్లో ఉంటన్నామని చాలా మంది అవమానించారని, తాము రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉండటంతో ఓ ఓనర్ తమని బయటకు పంపించే ప్లాన్ కూడా చేశాడని వాపోయింది.
ఇక ఆదిరెడ్డి చెబుతూ, తనకు సొంతిళ్లు లేదని బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచే ప్రైజ్ మనీతో తన భార్యకి ఇళ్లు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. శ్రీ సత్య చెబుతూ, తాము చిన్నప్పట్నుంచి గోల్డెన్ స్ఫూన్‌లో పెరిగానని, కాకపోతే ఇప్పుడు అమ్మానాన్న అనారోగ్యం పెద్ద సమస్యగా మారిందని, అమ్మ హెల్త్ కోసం ఈ డబ్బు కావాలని పేర్కొంది శ్రీ సత్య. కీర్తి .సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నట్టు తెలియజేసింది.
also read news:
Sania Mirza: షో కోసమే విడాకుల నాటకమా.. సానియా, షోయబ్‌లని తిట్టిపోస్తున్న నెటిజన్స్