Chiranjeevi: అప్పటి సీనియర్ హీరోలు చిరంజీవి (chiranjeevi), బాలకృష్ణ (balakrishna) వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఇద్దరు పోటీ పడి మరీ సినిమాలు చేసేవాళ్లు. ఆన్ దీ స్క్రీన్ ఎంత పోటీ తత్వం ఉన్నా కూడా ఆఫ్ ది స్క్రీన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. వారి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్‌ను ఎలివేట్ చేసేలా ఇప్పుడొక పాత ఫొటో నెట్టింట తెగ వైరల్ (viral pic) అవుతోంది.
ఇంతకీ ఆ ఫొటోలో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ఇందులో చిరంజీవి పట్టు వస్త్రాలు ధరించి పూలతో అలంకరించిన పందిరి మంచం మీద శోభనం పెళ్ళికొడుకులా తయారై కూర్చొని ఉండగా, ఎదురుగా బాలయ్య కూర్చొని చిరుతో మాట్లాడుతున్నాడు.
ఇది అసలు కహానీ
ఈ ఫోటో చూస్తుంటే ఇద్దరి మధ్య సీరియస్ సంభాషణ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది.అయితే అసలు చిరంజీవి ఉన్న శోభనం గదిలో బాలకృష్ణ ఎందుకు ఉన్నాడు? అసలు ఈ సంఘటన నేపథ్యం ఏమిటీ? ఎప్పుడు జరిగిందని? తెలుసుకోవాలనే ఆత్రుత ఇప్పుడు అందరిలో ఉంది.
అసలు మేటర్‌లోకి వెళితే.. అది ఘరానా మొగుడు (gharana mogudu) మూవీ సెట్స్ లో జరిగింది. ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ఈ సినిమా ఓపెనింగ్ సీన్‌గా ఇంటర్వెల్ సీన్‌ను చిత్రీకరించారు. అందులో చిరంజీవి శోభనం పెళ్లి కొడుకు గెటప్‌లో ఉండి నగ్మాతో ఛాలెంజ్ చేసే సన్నివేశం.
అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ అతిథిగా రావడంతో, ఇద్దరు కలిసి అక్కడున్న మంచం మీదనే కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు.
బాలకృష్ణకు రాఘవేంద్రరావు అత్యంత సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఘనత రాఘవేంద్రరావు సొంతం కాగా, ఆ పరిచయంతో బాలయ్యను తన సినిమా ఓపెనింగ్ కి పిలవడం జరిగింది.
చిరంజీవి కెరీర్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిన కమర్షియల్ సినిమాగా ఘరానా మొగుడు ప్రత్యేక ఘనత దక్కించుకుంది. తమిళ చిత్రం ‘మన్నన్’కు ఇది రీమేక్ కాగా,ఈ సినిమాలో పాటలన్నీ ప్రేక్షకాదరణను పొందాయి.
చిరంజీవి సరసన నగ్మా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తే వాణీ విశ్వనాథ్ సెకండ్ హీరోయిన్‌గా కనిపించి అలరించింది. కీరవాణి స్వరపరచిన ఏందీ బే ఎట్టాగ ఉంది వళ్లు, కిటుకులు తెలిసిన చిటపట చినుకులు వంటి సాంగ్స్ యూత్ ని ఊపేశాయి.
also read news:
పిల్లలు ఇష్టపడే స్వీట్ నూడుల్స్ రెడీ