Bigg Boss 6: కొద్ది రోజులుగా బిగ్ బాస్‌లో కెప్టెన్సీ టాస్క్ ఎంత రంజుగా సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. బ్లూ, రెడ్ టీంలుగా విడిపోయిన కంటెస్టెంట్స్ ఈ టాస్క్‌లో రెచ్చిపోయి ఆడారు. ఎవరు కెప్టెన్ అవుతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో హౌజ్‌కి కొత్త కెప్టెన్ అయ్యింది ఎవరు ?
తాజా ఎపిసోడ్లో ఆట నుంచి ఫిజికల్ గేమ్ ఆడే అర్హత కోల్పోయిన గీతూ.. ఆదిరెడ్డిని మాయ చేసి అతడి టీ షర్ట్‌ను ఎత్తుకుపోవడాన్ని బిగ్ బాస్ తప్పుబట్టారు. దీంతో ఆమె కూడా చచ్చిపోయిందని అన్నారు. ఇక గీతూ మీద కోపంతో టీషర్ట్‌తో పాటు మైక్‌ను నేలకేసి కొట్టిన ఆదిరెడ్డిని కూడా బిగ్ బాస్ డిస్క్వాలిఫై చేయడంతో గేమ్ ఇంట్రెస్టింగ్గా మారింది.
కెప్టెన్సీ టాస్క్..
మొత్తం మీద ఈ టాస్క్ పూర్తయ్యే సరికి రెండు జట్లలో చెరో నలుగురు మాత్రమే బతికి ఉండగా, మిషన్ పాజిబుల్ డ్రా అయ్యింది. ఇక ఇరు జట్ల కెప్టెన్లు తమ జట్ల నుంచి చెరో ముగ్గురిని కెప్టెన్సీ పోటీదారులగా ప్రకటించాలని బిగ్ బాస్ సూచించడంతో కెప్టెన్ గీతూ.. తాను, ఫైమా, శ్రీసత్య పాల్గొంటామని ప్రకటించింది. మరో కెప్టెన్ ఆదిరెడ్డి.. తమ జట్టు నుంచి వసంతి, ఇనయ, మెరీనా పాల్గొంటారని తెలిపాడు.
ఇక కెప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే.. పోటీదారులు అయిన శ్రీసత్య, ఫైమా, గీతూ, ఇనయ, వసంతి, మెరీనా తమ బెలూన్లను కాపాడుకుంటూ ఇతరుల బెలూన్లను పగలగొట్టాల్సి ఉంటుంది.. చివరికి ఏ పోటీదారు బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే ఈ టాస్క్‌లో గెలిచి ఇంటి కెప్టెన్ అవుతారు అని బిగ్ బాస్ తెలిపారు.
ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి సంచాలకుడిగా వ్యవహరించారు . టాస్క్ ఆడేటప్పుడు కారిడార్ పైకి ఎక్కకూడదని సంచాలకుడు కండిషన్ పెట్టినప్పటికీ , గీతూ ఆ కండిషన్‌ను అతిక్రమించింది. దీంతో మొదటిగా ఆమె ఔట్ అయ్యింది. ఆ వెంటనే శ్రీసత్య.. మెరీనా చేతిలో బెలూన్ను కిందపడేసింది. దీంతో ఆమె కూడా ఔట్ అయింది. ఆ తరవాత ఫైమా, గీతూ కలిసి వసంతిని టార్గెట్ చేసి ఔట్ చేసేశారు. ఇక వసంతి, మెరీనా కలిసి ఫైమాతో కుస్తీలు పట్టి మరీ బెలూన్ను పగలగొట్టారు.
చివరికి శ్రీసత్య, ఇనయ మిగిలారు. మెరీనా, వసంతిలను ఫైమా కట్టడి చేయడంతో ఇనయ మీదికి గీతూ వెళ్లింది. ఇనయ బెలూన్ను గీతూ పగలగొట్టడంతో శ్రీసత్య కెప్టెన్ అయిపోయింది. దీంతో ఇనయ.. ఆడి గెలవాలి అంటూ కుళ్లుకుంటూ వారిపై పలు ఆరోపణలు చేసింది.
also read:
horoscope : 5-11-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు
aloe vera uses : కలబందతో 7 అద్భుతమైన ఉపయోగాలు