Viral Video : సింహం వేట ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది వేట మొదలు పెట్టిందంటే ఎంతటి జంతువైనా దానిబారి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇక ఆ రోజుతో దాని ఆయువు ముగిసినట్లే. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం సింహం స్కెచ్ మిస్ అవుతుంటుంది.సాధారణంగా జంతువు ఏదైనా సరే అడవిలో మనుగుడ సాగించాలంటే వేటాడక తప్పదు. క్రూర జంతువుల నుంచి సాధు జంతువుల వరకు వారి జీవనాధారం వేటపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సింహం, పులి, చిరుత లాంటి జంతువుల వేట గురించి అందరికి తెలిసిన విషయమే.
వాటి పంజా పవర్‌కు నిదర్శనంగా నిలిచే ఎన్నో వీడియోలు తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. అయితే ఈ జంతువులు తమ పిల్లలకు సైతం వేటని చిన్నప్పటి నుండే నేర్పిస్తుంటాయి. ఆహారం ఎలా సంపాదించుకోవాలి, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే వాటికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ సింహాం తన పిల్లలకు వేట నేర్పిస్తుండగా, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Dad's day out with kids😀
— Tansu YEĞEN (@TansuYegen) October 31, 2022
సహజంగా మగ సింహాలు వేటాడవు..కానీ ఆడసింహాలు ఎక్కువగా వేటాడుతూ ఉంటాయనే విషయం తెలిసిందే. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ తండ్రి సింహం తన పిల్లలతో షికారుకు వెళుతుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మగసింహ అడవిలో నడుస్తూ ఉంటే దాన్ని అనుసరిస్తూ దాని పిల్లలు కూడా వెళ్తూ కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో సింహం తన పిల్లలకు పరిగెత్తడం ఎలా అనేది నేర్పిస్తున్నట్టుగా కనిపించింది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వేట నేర్పిస్తున్న నాన్న.. నాన్న బాటలో పిల్ల సింహాలు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
also read:
Krithi Shetty: కృతి శెట్టి అలా అనేసిందేంటి.. ఇక రెచ్చిపోయిన నెటిజన్స్
IND vs ZIM: పాక్ నటి బంపర్ ఆఫర్ .. ఇండియాని జింబాబ్వే ఓడిస్తే అందులో ఒకరిని పెళ్లి చేసుకుంటా..!