KL Rahul: టీమిండియా ఓపెనర్ గత మ్యాచ్‌లలో ఎంత దారుణంగా విఫలం అయ్యాడో మనం చూశాం. 4, 9, 9.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు టీ20 వరల్డ్ కప్‌లో కేఎల్ రాహుల్ గణాంకాలు ఇవి.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో రాహుల్‌ను పక్కనబెట్టాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. రాహుల్ బదులు పంత్‌ను ఆడించాలని , రాహుల్ జట్టుకు భారంగా మారాడంటూ విమర్శలొచ్చాయి. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం ఓపెనర్‌పై నమ్మకం ఉంచి బంగ్లా మ్యాచ్‌కి కూడా కేఎల్ రాహుల్‌ని తీసుకున్నారు. దాన్ని నిలబెడుతూ బంగ్లాతో మ్యాచ్‌లో రాహుల్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాహల్‌తో విరాట్ కోహ్లి మాట్లాడాడు. ప్రాక్టీస్ సెషన్లో ఓపెనర్‌తో చాలా సేపు మాట్లాడిన కోహ్లి.. తన సహచరుడికి పలు సూనచలు చేశాడు.
ఫామ్‌లోకి రాహుల్..
విరాట్ సూచనలతోనే రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.బంగ్లా మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త మెల్లగా ఆడిన రాహుల్.. తర్వాత స్పీడ్ పెంచాడు. కోహ్లి.. రాహుల్‌ను ఎంకరేజ్ చేయడంతో వేగంగా ఆడిన రాహుల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక అనంతరం మాట్లాడుతూ.. జట్టు నాకు ఒక బాధ్యతను ఇచ్చింది. అది నేను పూర్తి చేయగలిగితే ప్రశాంతంగా నిద్రపోతా అని రాహుల్ అన్నాడు. మేము నిజంగా కష్టపడుతున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో మేము మా ప్రణాళికలను అమలు చేస్తాము. ఫామ్‌లో ఉన్న లిట్టన్ దాస్‌ను ఔట్ చేయడానికి డీప్ నుండి డైరెక్ట్ త్రో వేయడంపై స్పందించిన రాహుల్.. మేమంతా ఫీల్డింగ్‌లో చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటాము. వేగంగా కదలడానికి ప్రయత్నిస్తున్నాం. క్రమంలోనే నేను వేసిన బంతి డైరెక్ట్‌గా స్టంప్‌లను తాకింది.”
ఇండోర్ ట్రైనింగ్ సెషన్‌లో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో చర్చించిన విషయాలపై కూడా నోరు విప్పాడు రాహుల్. కోహ్లీ పరుగులు బాగానే చేస్తున్నాడు. నేను కూడా ఆయన మాదిరిగా పరుగులు రాబట్టేందుకు సూచనలు తీసుకున్నా. ఇక లిట్టన్ అసాధారణమైన నాక్ ఆడాడు మరియు ఇలాంటి ఇన్నింగ్స్‌లు ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తెస్తాయి.. అతను మంచి లెంగ్త్‌తో వేసిన బౌలర్లను కొట్టాడు. కానీ వర్షం విరామం మాకు సహాయం చేసిందని అతను అంగీకరించాడు.
read more news:
Bigg Boss 6: బిగ్ బాస్ హౌజ్‌లో ఘోరాతి ఘోరాలు.. శ్రీహాన్‌ని ఇనయ అంత మాట అనేసిందేంటి ?
horoscope : 3-11-2022 ఈ రోజు మీ రాశి ఫలితాలను చూడండి..