HomecinemaHappy Birthday Shah Rukh Khan : షారూఖ్ ఖాన్ గురించి ఈ 10 ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..!

Happy Birthday Shah Rukh Khan : షారూఖ్ ఖాన్ గురించి ఈ 10 ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..!

Telugu Flash News

బాలీవుడ్ బాద్ షాగా పేరు తెచ్చుకున్న షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒక‌ప్పుడు ఎన్ని సెన్సేష‌న్స్ క్రియేట్ చేశాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. సెకండ్ హీరోగా 1992లో ‘దివానా’ సినిమాతో తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఖాన్.. తన నటన, స్టైల్ తో.. అభిమానుల మ‌న‌సుల‌ని గెలుచుకున్నాడు. మొదట్లో నెగెటివ్ రోల్స్‌కే పరిమితం అయిన షారుక్ ఆ తర్వాత లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా దాదాపు 15 ఏళ్ళ పైనే బాలీవుడ్‌ను ఏలాడు. ఇటీవ‌ల వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో కాస్త స్లో అయ్యాడు.

ఈ రోజు షారూఖ్ బ‌ర్త్ డే (2 November 1965). ఈ సంద‌ర్భంగా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మీ కోసం..

‘షారూఖ్ ’ అతని అసలు పేరు కాదు

షారూఖ్ ఒక‌ప్పుడు క‌ఠిన పేద‌రికంలో జీవితం గడిపాడు. ఇప్పుడు కోట్ల‌కు అధిప‌తి అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెజెండరీ నటులలో ఆయ‌న ఒక‌రు. షారూఖ్ అస‌లు పేరు అబ్ధుల్ ర‌షీద్ ఖాన్.. ఈ పేరు అత‌ని త‌ల్లి త‌ర‌పు అమ్మ‌మ్మ పెట్టారు. ఆమె ద‌గ్గ‌రే షారూఖ్ 5 సంవత్స‌రాల వ‌ర‌కు నివ‌సించాడు. త‌ర్వాత తన త‌ల్లిదండ్రుల ద‌గ్గర‌కు వెళ్ల‌గా, అప్పుడు షారూఖ్ ఖాన్ అని పేరు మార్చారు.

బుర్జ్ ఖలీఫా పై మెరిసిన కింగ్ ఖాన్

షారుఖ్ ఖాన్‌ను “ది కింగ్ ఆఫ్ బాలీవుడ్” అని పిలుస్తారనే విష‌యం తెలిసిందే. అది షారూఖ్‌కి అంత ఈజీగా రాలేదు. పరిశ్రమలో అతని నిరంతర కృషి , అంకితభావానికి ఆ గౌర‌వం క‌ట్ట‌బెట్టారు. గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పై మెరిసిన కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అతని 57వ పుట్టినరోజు సందర్భంగా మ‌రోసారి వెలిగాడు. వారు బాలీవుడ్ రాజుకు ప్రత్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతో టవర్ అంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది.

యూఏఈతో అనుబంధం

shahrukh khanయూఏఈతో షారుఖ్ ఖాన్‌కు మంచి బంధం ఉంది. 2016లో, దుబాయ్ టూరిజంను ప్రోత్సహించడానికి కింగ్ ఖాన్‌తో దుబాయ్ టూరిజం ఒప్పందం చేసుకుంది. ‘దుబాయ్ నాకు రెండవ ఇల్లు లాంటిదని, ఈ అందమైన నగరంతో నాకు నిజంగా అనుబంధం ఉందని ఓ సంద‌ర్భంలో అన్నాడు షారూఖ్.’ అతను బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు, దుబాయ్‌లోని పామ్ జుమేరాలో ఒక అందమైన ద్వీపంలో ఇంటిని కూడా కలిగి ఉన్నట్టు స‌మాచారం. ఈ విల్లాకు ‘జన్నత్’ (అంటే స్వర్గం) అని పేరు పెట్టారు . ఈ విల్లా ధర 2 మిలియన్ డాలర్లు అని స‌మాచారం.. ఈ విల్లాను దుబాయ్‌కి చెందిన ప్రాపర్టీ డెవలపర్ కింగ్ ఖాన్‌కు బహుమతిగా ఇచ్చారు.

ఇటీవల, ఇండియన్ ర్యాపర్ హనీ సింగ్ దుబాయ్‌లో షారుక్‌తో సమావేశమైనప్పుడు జరిగిన సంఘటన గురించి వివ‌రించాడు. ఎస్‌ఆర్‌కేతో సమావేశం 30 నిమిషాల పాటు షెడ్యూల్ చేయగా, అది 3 గంటల పాటు కొనసాగింది. అయితే ఫ్లైట్ మిస్ అవుతుంద‌నే భ‌యంతో నేను ఉండ‌గా, షారూఖ్ ఎమిరేట్స్ ఫ్లైట్‌ని 3 గంటలు డిలే చేయించాడు. అది షారుక్ ఖాన్ పవర్!’ అని సింగ్ అన్నాడు.

-Advertisement-

వాంఖడే స్టేడియంలోకి నిషేధం

ఇక వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించకుండా షారుక్ ఖాన్‌ను ఎంసీఏ నిషేధించింది. మే 16, 2012న, ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఉల్ మ్యాచ్ జరుగుతోంది, ఆ మ్యాచ్ తర్వాత అతను వాంఖడే స్టేడియంలోని సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగాడు. ఈ క్ర‌మంలో అత‌నిపై ఐదేళ్లపాటు ప్రవేశంపై నిషేధం విధించారు. అత‌ను త‌న చేసిన ప‌నికి క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోగా, స‌మ‌ర్ధించుకోవ‌డంతో మేనేజింగ్ కమిటీ ఖాన్‌ను స్టేడియంలోకి ప్రవేశించకుండా ఐదేళ్లపాటు నిషేధించాల్సి వచ్చింది.

చలనచిత్ర రంగ ప్రవేశం

షారుఖ్ ఖాన్ తన కెరీర్‌ను టెలివిజన్ సీరియల్స్ తో ప్రారంభించాడు. అతను నటించిన కొన్ని సీరియల్స్ చూస్తే “దిల్ దరియా”, “వాగ్లే కి దునియా”, మొదలైనవి ఉన్నాయి . 1991 లో, తన తల్లి మరణం తరువాత, ఆ బాధ నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి సినిమాల్లో నటించాలనే నిర్ణయానికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో ఢిల్లీ నుండి ముంబైకి వ‌చ్చాడు. తొలిసారి జూన్ 1992లో విడుదలైన దీవానాలో చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. అతని మొదటి చిత్రం దిల్ ఆష్నా హై, కానీ దీవానా అంతకు ముందు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీవానా బాక్స్ ఆఫీస్ హిట్ అయ్యింది మరియు ప్రపంచవ్యాప్తంగా 162.1 మిలియన్లకు పైగా సంపాదించి, బీటా తర్వాత 1992లో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. దీవానాలో తన నటనకు షారూఖ్ “ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు” పొందాడు.

అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం

షారుఖ్ ఖాన్ మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రం 2013 సంవత్సరంలో అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం షారూఖ్‌ యొక్క అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. హిందీలో రూ. 207.69 కోట్లు మరియు ప్రపంచవ్యాప్తంగా రూ. 424.54 కోట్ల కలెక్షన్లు రాబ‌ట్టింది.. ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు

కెరీర్‌ – అవార్డులు

shahrukh khan
shahrukh khan

కింగ్ ఖాన్ తన అద్భుతమైన కెరీర్‌లో చాలా అవార్డులను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు, అతను 338 అవార్డులకు నామినేట్ అయ్యాడు. వాటిలో 297 గెలుచుకున్నాడు. అతని అవార్డులలో 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 17 స్క్రీన్ అవార్డులు, 6 ఐఫా అవార్డులు మరియు 5 ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డులు ఉన్నాయి. అతను తన మొదటి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిని 1993లో “బాజీగర్” చిత్రానికి గెలుచుకున్నాడు. 2005లో, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నాడు. 2014లో ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం “ఆర్డర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ష‌తో గౌర‌వించ‌బ‌డ్డాడు.అయితే అత‌నికి ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ అవార్డ్ ద‌క్క‌లేదు. ఈ విష‌యంపై ఓ సారి స్పందించిన షారూఖ్ ఖాన్.. తాను జీవితంలో దేనికీ పశ్చాత్తాపపడనని, నాకు జాతీయ అవార్డు రాకపోతే అది అవార్డు కే మైనస్ అవుతుంద‌ని అన్నారు.

ఫ్లాప్ సినిమాలు

షారుఖ్ ఖాన్ బాలీవుడ్‌లో కింగ్ అయినప్పటికీ, అతని కెరీర్‌లో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అతనికి 20కి పైగా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అతని మొదటి ఫ్లాప్ చిత్రం చమత్కార్, ఇది అతని కెరీర్‌లో రెండవ చిత్రం, జూలై 8, 1992న విడుద‌లైంది. ఇది కేవలం 2.75 కోట్లు మాత్రమే సంపాదించింది. ఆ తర్వాత, అతని మూడవ చిత్రం దిల్ ఆష్నా హై, అదే సంవత్సరంలో విడుద‌లైంది, అది కూడా ఫ్లాప్ అయ్యింది మరియు 1.25 కోట్లు మాత్రమే సంపాదించింది. అలా వ‌రుస ఫ్లాపులు వ‌చ్చిన కూడా తన హార్డ్ వర్క్ మరియు దృఢ సంకల్పంతో బాలీవుడ్‌కి కింగ్‌గా నిలిచాడు. కింగ్ అంకుల్, ఓ డార్లింగ్! యే హై ఇండియా!, జమానా దీవానా, ఇంగ్లీష్ బాబు దేశీ మేమ్, చాహత్, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ, వన్ 2 కా 4, మొదలైనవి అతని కెరీర్‌లో కొన్ని ఫ్లాప్ సినిమాలు.

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే రికార్డు

shahrukh khanషారూఖ్ కెరీర్‌లో ఎక్కువ ప్రజాదరణ పొందిన సినిమాలలో ఒకటి ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే. ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలో ఎక్కువ కాలం నడిచిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం అక్టోబర్ 20, 1995న విడుదలైంది, ఇందులో షారుక్ ఖాన్ మరియు కాజోల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ముంబైలోని ‘మరాఠా మందిర్’ అనే పేరుగల థియేటర్‌లో నిరంతరం రన్ అవుతోంది. ఈ థియేటర్ లో ఇప్పటికీ ఈ చిత్రాన్ని ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు ప్రదర్శిస్తారు

గౌరీ ఖాన్‌తో ప్రేమ – పెళ్లి

ఇక షారూఖ్ ఖాన్ మంచి మ‌నిషి మాత్ర‌మే కాదు ప్రేమికుడు కూడా. ఢిల్లీలో నివసిస్తున్న సమయంలో గౌరీ ఖాన్‌తో ప్రేమలో పడ్డాడు షారూఖ్. పెళ్లి చేసుకోవాల‌ని భావించిన షారూఖ్‌.. ఆమెని చ‌ట్ట‌బ‌ద్ధంగా వివాహ చేసుకున్నారు. ఆ తర్వాత, ఈ జంట ఆగష్టు 26, 1991న ‘నికా’ అనే ముస్లిం సంప్రదాయ వివాహం చేసుకున్నారు. తర్వాత, 25 అక్టోబర్ 1991న, వారు మళ్లీ హిందూ సంప్రదాయ వివాహ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. షారుక్ ముస్లిం మరియు గౌరీ పంజాబీ కాబట్టి ప్రేమికులిద్దరూ రెండు మత సంప్రదాయాల ద్వారా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా మూడుసార్లు వారి పెళ్లి జ‌రిగింది.

కింగ్ ఆఫ్ ది బాలీవుడ్

షారూఖ్ ఖాన్‌.. కింగ్ ఆఫ్ ది బాలీవుడ్ కావ‌డం వెన‌క చాలా క‌ష్టం ఉంది. చిన్న వయస్సులో, అతను తన తల్లిదండ్రుల మరణం తరువాత తన కుటుంబ బాధ్యతను మోసాడు. తన బాధ్యతతో పాటు తన కలలపై దృష్టి సారించి కష్టపడి పనిచేశాడు. ఒక చిన్న ఈవెంట్‌లో చిన్న పాత్ర చేసినా లేదా పెద్ద పాత్ర చేసినా ప్రతి విషయంలోనూ వంద శాతం ఎఫ‌ర్ట్ పెట్టేవాడు. త‌ను కోట్ల‌కు అధిప‌తి అయిన ఎప్పుడు డౌన్ టూ ఎర్త్ ఉంటారు. ప్రతి ఒక్క‌రితో స్నేహా భావంతో మెలుగుతారు.

షారూఖ్‌ తన కెరీర్‌లో ప్రయోగాలకు కూడా పెద్ద పీటవేశారు. ఫెయిల్యూర్స్‌కు భయపడకుండా.. సినిమాలు చేసుకుంటూ వెళ్లి.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ‘పర్‌దేశ్‌, డీడీఎల్‌జే, దేవదాస్‌, కల్‌హోనా హో, వీర్‌జరా, చక్‌దే ఇండియా’ లాంటి పర్ఫార్మెన్స్‌ బేస్డ్‌ సినిమాలే కాకుండా.. ‘దిల్‌ సే, అశోక, ఛల్తే ఛల్తే, స్వదేశ్‌, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌, రా వన్‌, ఫ్యాన్‌, రాయిస్‌’ లాంటి ప్రయోగాలు చాలానే చేశారు. ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ మిగిల్చినప్పటికీ.. షారూఖ్‌ యాక్టింగ్‌కు ఆడియెన్స్‌ను ఫిదా చేయకుండా ఉండలేకపోయాయి. షారూఖ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.

read more news :

Happy Birthday Aishwarya Rai : ఈ ప్రపంచ సుందరి గురించి తెలుసుకోవాల్సిన 40 వాస్తవాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News