Happy Birthday Aishwarya Rai : అందం,అభినయం ఉన్న నటీమణులలో మనకు ఠక్కున గుర్తొచ్చేది ఐశ్వర్యరాయ్. గ్లోబల్ బ్యూటీగా పేరొందిన ఐష్ తొలుత 1997లో సినిమా రంగంలోకి ప్రవేశించింది.ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్‌తో అపారమైన ప్రజాదరణ పొందింది. ఈ రోజు November 1 ఐశ్వర్యరాయ్ బర్త్ డే కాగా, ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం…
- 1994లో ఐశ్వర్య ప్రపంచ సుందరి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
- 1997లో మణిరత్నం తెరకెక్కించిన తమిళ చిత్రం ఇరువర్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
- 1998 లో జీన్స్ అనే చిత్రంలో ఐష్ నటించగా, ఆ కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన చిత్రంగా ఇది నిలిచింది.
- ఆమె హమ్ దిల్ దే చుకే సనమ్ (1999) మరియు దేవదాస్ (2002) చిత్రాలకు ఉత్తమ నటి విభాగంలో రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.
- ఐశ్వర్య రయ్ పలు భాషలలో నటించింది. చిత్ర పరిశ్రమలో 2 దశాబ్దాలకు పైగా అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉంది.
- హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీష్ మరియు బెంగాలీ వంటి బహుభాషా చిత్రాలలో నటించింది.
- ఐశ్వర్య జంతుశాస్త్రాన్ని ఇష్టపడినందున వైద్య వృత్తిని కొనసాగించాలనుకుంది.
- ఆర్టిటెక్ట్ కూడా కావాలని అనుకుంది. అందుకే డిగ్రీలో ఆర్ట్స్ తీసుకుంది. చివరికి మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిసినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
- కరణ్ జోహార్ కుచ్ కుచ్ హోతా హైలో రాణి ముఖర్జీ పాత్ర టీనా పాత్రను ముందుగా ఐశ్వర్యకు ఆఫర్ చేశారట?
- ఆమె 2003లో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్‌గా ఉన్న మొదటి భారతీయ నటి.
- 9వ తరగతి చదువుతున్నప్పుడు,ఐష్ క్యామ్లిన్ పెన్సిల్స్ యాడ్‌లో కనిపించింది.
- నెదర్లాండ్స్‌లోని క్యూకెనోఫ్ గార్డెన్‌లో ఉన్న తులిప్ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య రాయ్ పేరు పెట్టారు.
- ఐశ్వర్యరాయ్ పుస్తకాల పురుగు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతుంటారు. తన గురించి రాసిన ప్రత్యేక కథనాన్ని తప్పక చదువుతుంది
- ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత.
- 2012లో ఆమెకు బ్రిటన్ ప్రభుత్వం ‘ఆడ్రె డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్’ పురస్కారాన్ని అందించింది.
- 1992-1993 ముంబై అల్లర్ల సమయంలో ఒక్క రాత్రిలో చిత్రీకరించబడిన పెప్సీ వాణిజ్య ప్రకటన కోసం ఆమె అమీర్ ఖాన్‌తో కలిసి నటించింది . అదివిపరీతమైన ప్రజాదరణ పొందింది.
- అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్‌తో లంచ్‌కి ఆహ్వానించబడిన ఏకైక నటి ఐశ్వర్య మాత్రమే, కాని ఆ సమయంలో హాజరు కాలేకపోయింది.
- ఆమె యుక్తవయస్సులో 5 సంవత్సరాలకు పైగా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది.
- ఓప్రా విన్‌ఫ్రే షోలో పాల్గొన్న తొలి భారతీయురాలు ఆమె.
- ఐశ్వర్య తన అభిమాన నటుడైన సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి రోబోలో నటించింది.
- ఐశ్వర్య కోసం 17,000 కంటే ఎక్కువ ప్రత్యేక వెబ్‌సైట్‌లు ఉన్నాయి.
- ఆమె తరచుగా ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పరిగణించబడుతుంది.
- ఆమె అనేక స్వచ్ఛంద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది . వాటికి తన వాటాను ఎల్లప్పుడు అందిస్తుంది.
- సల్మాన్ ఖాన్‌తో ప్రేమయాణం వలన 2000 సంవత్సరంలో ఎక్కువగా వార్తలలో నిలిచేది.
- ఐశ్వర్య 2007లో అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది.
- 2011 లో, ఆమె ఆరాధ్య బచ్చన్‌కి జన్మనిచ్చింది.
- మామ అమితాబ్ బచ్చన్ తర్వాత, మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఉంచిన రెండవ సెలబ్రిటీగా ఐశ్వర్య ఖ్యాతి గడించింది.
- 2005లో అమెరికన్ పబ్లిషర్ హ్యూ హెఫ్నర్.. ఐశ్వర్యతో కలిసి ప్లేబాయ్ మ్యాగజైన్ కి సంబంధించి ఓ డాక్యుమెంటరీ రూపొందించాలనుకున్నాడు, అయితే ఆ ఆఫర్‌ను నటి తిరస్కరించిందని ఆరోపించారు.
- తన భర్త అభిషేక్ మరియు కుమార్తె ఆరాధ్య కోసం ఐశ్వర్యరాయ్ స్వయంగా వంట చేస్తుంది.
- బాలీవుడ్ ఫేమస్ నటి రేఖ… ఐశ్వర్యరాయ్‌పై ప్రశంసలు కురిపించింది. తన తల్లితో ఐష్ షాపింగ్ చేస్తున్న సమయంలో రేఖ ఓ సారి ఐష్‌ని కలిసి ఆమె పనితీరుని మెచ్చుకుందట.
- ఐశ్వర్యరాయ్ ముద్దుపేరు గుల్లు.
- ఐష్ ఆరాధ్య పుట్టిన తర్వాత 45 లక్షల విలువ మంగళసూత్రాంలో కొంత మార్పులు చేసింది.
- ఐశ్వర్య మరియు రాణి ముఖర్జీ మంచి స్నేహితులు, అయినప్పటికీ, వారు కొన్ని కారణాల వలన విడిపోయారు.
- షారుఖ్ ఖాన్ నటించిన చల్తే చల్తేలో ముందుగా ఐష్‌ని సంప్రదించారు. కానీ ఆ తర్వాత ఆమె స్థానంలో రాణి వచ్చి చేరింది.
- 2002లో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్ తో కలిసి నటించిన దేవదాస్ మిలీనియంలోని 10 ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
- ఐశ్వర్య తన కెరీర్‌లో అనేక హిట్ చిత్రాలను అందుకుంది. అలానే కొన్ని ఫ్లాప్‌లను కూడా చవి చూసింది.
- 2010లో సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకుంది.
- 2015లో వచ్చిన జజ్బా చిత్రంతో ఆమె తిరిగి చిత్ర పరిశ్రమకు వచ్చారు.
- ఐశ్వర్య అభిషేక్‌ల వైవాహిక జీవితం సాఫీగా నడుస్తుంది.
- ఆమెని అభిమానులు ‘బచ్చన్ బహుగా పిలుచుకుంటారు. ఇక మంచి కోడలిగా, తల్లిగా, భార్యగా ఐష్ మంచి పేరు తెచ్చుకుంది.
also read :
Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ షాకింగ్ వివాదాలు..సల్మాన్ ఖాన్ తో బ్రేక్ అప్ నుండి ఇప్పటి వరకు..
-Advertisement-