Horoscope Today, 29th October 2022: Check astrological prediction for your zodiac signs
మేష రాశి ఈరోజు ఫలితాలు : October 29, 2022 Aries horoscope
మేష రాశివారు చేపట్టే ప్రతిపనిలో జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది. ఈరోజు కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయాలంటే ఆటంకాలను తొలగించుకుంటూ ముందుకు వెళ్లడం చేయాలి.
వృషభ రాశి ఈరోజు ఫలితాలు : October 29, 2022 Taurus
ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త తప్పక వింటారు. అధిక శ్రమ పడితే మంచిది. వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లోని వారు కాలాన్ని వృధా చేయకుండా మానసికంగా ధైర్యంతో ముందుకు వెళ్లాలి . కుటుంబ వాతావరణం బాగుంటుంది.
మిధున రాశి ఈరోజు ఫలితాలు : October 29, 2022 Gemini
ఈ రోజు ఈ రాశివారు కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి
కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : October 29, 2022 Cancer horoscope
ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మనస్సు ఉత్సాహపరచుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉంటే మంచిది. కీలక వ్యవహారాలలో ముందడుగు వేయాలి.
సింహ రాశి ఈరోజు ఫలితాలు : October 29, 2022 Leo
ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా ఉంటారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఎవరిని కూడా అతిగా నమ్మకపోవడం మంచిది.
కన్య రాశి (Virgo) ఈరోజు ఫలితాలు : October 29, 2022
ఈ రాశివారు ఈరోజు శుభకార్యాలకు అటెండ్ అవుతారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం వలన సమస్యలు సాల్వ్ అవుతాయి.. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకర వాతావరణం లభిస్తుంది.
తుల రాశి (Libra) ఈరోజు ఫలితాలు : October 29, 2022 horoscope
ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉంది. మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. అధికారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి (Scorpio) ఈరోజు ఫలితాలు : October 29, 2022
ఈరోజు ఈ రాశివారు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడ చేస్తారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.. భవిష్యత్ ప్రణాళికలతో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం మంచిది
ధనస్సు రాశి (Saggitarius) ఈరోజు ఫలితాలు : October 29, 2022
ఈరోజు ఈ రాశివారు సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఇబ్బంది తలెత్తే పనులకు దూరంగా ఉండడం ఎంతో అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
మకర రాశి (Capricorn) ఈరోజు ఫలితాలు : October 29, 2022 horoscope
ఈరోజు ఈ రాశివారు ధన, ధాన్య లాభాలను పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్ధిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాణిజ్య రంగంలోని వారికి కీలక వ్యవహారాలు ఫలిస్తాయి.
కుంభ రాశి (Aquarius) ఈరోజు ఫలితాలు : October 29, 2022
ఈ రోజు ఈరాశివారు ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తే మంచిది. ధన యోగం ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది.
మీన రాశి (Pisces) ఈరోజు ఫలితాలు : October 29, 2022 horoscope
ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన కూడా ధైర్యంతో ముందుకు అడుగేస్తారు. నిరుత్సాహ పరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనవసర ఖర్చులు చేయకుండా ఉంటే మంచిది.
మరిన్ని వార్తలు చదవండి:
Viral Video: మితి మీరుతున్న రిస్కీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు.. నోరెళ్లపెడుతున్న నెటిజన్స్
Suryakumar Yadav: ఫన్నీ మూమెంట్.. అవార్డ్ ఇచ్చే దాక ఆగలేకపోయిన సూర్య.. రియాక్షన్ చూడండి..!