Viral Video: ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఎక్కువయ్యాయి. చిన్న వేడుక జరిగిన సరే ఫొటో షూట్ అంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా చేసుకుంటున్న ఈ ఫోటోషూట్లు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
పుట్టినరోజులు, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. కొంతమంది ఫోటో షూట్ పేరుతో ప్రమాదాలను సైతం కొనితెచ్చుకుంటున్నారు. జాగ్రత్తలు మరిచి ప్రాణాలని రిస్క్‌లో పెట్టేస్తున్నారు.
తాజాగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కి సంబంధించిన వీడియో వైరల్ కాగా, ఇందులో వధువు మరియు వరుడు మోటార్ సైకిల్‌పై కూర్చున్నారు. క్రేన్ సాయంతో బైక్‌ని పైకి లేపుతూ అదేదో జీప్ పై నుండి ఎగురుతున్నట్టు వీడియో గ్రాఫర్స్ షూట్ చేశారు.
pre-wedding shoots – i’m getting this pic.twitter.com/Ynwf7Kxr6a
— Best of the Best (@bestofallll) October 27, 2022
కాస్త పట్టు తప్పిందా పెద్ద ప్రమాదంలో పడతారు అంటూ వీడియో చూసిన వారు చెబుతున్నారు. ఈ వీడియోని ఇప్పటికే 3.2 లక్షల వ్యూస్ రాగా, 7,708 లైక్‌లు వచ్చాయి.
ప్రమాదాలు ఎక్కువ..
ఇటీవల ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. వధూవరులు తమను తాము నిప్పంటించుకున్న తర్వాత చేయి చేయి పట్టుకుని కలిసి నడుస్తున్నట్లు చూపించారు.
View this post on Instagram
ఈ వీడియోకి 15 మిలియన్స్ కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. 2019లో, కేరళలోని ఒక జంట తమ వివాహాన్ని గుర్తుండిపోయేలా ప్లాన్ చేశారు.
వారు ఫోటో కోసం పోజులివ్వడానికి పడవను ఎంచుకోగా, ఫొటో కోసం పోజులిస్తుండగా, జంట బ్యాలెన్స్ తప్పి పడవ నుండి నీళ్లలో పడిపోయారు.
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీకి చెందిన అనురాగ్‌రెడ్డి, శివానికి వివాహం కుదరగా, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం కోహెడలోని ఔటర్ పరిసరాల్లోకి వెళ్లారు.
ఫొటో షూట్లో నిమగ్నమైన సమయంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో అక్కడే ఉన్న పోలీస్ కంట్రోల్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
స్వల్ప గాయాలు కావడంతో పోలీసు సిబ్బంది సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఇలా చాల మంది ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ అంటూ రిస్క్‌లు చేస్తున్నారు.
మరిన్ని చదవండి :
Tamanna : పరువాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా.. బ్యూటీ అందాలకు పులుపెక్కిపోతున్న ఫ్యాన్స్
Suryakumar Yadav: ఫన్నీ మూమెంట్.. అవార్డ్ ఇచ్చే దాక ఆగలేకపోయిన సూర్య.. రియాక్షన్ చూడండి..!