Viral Video: సాధారణంగా గేమ్స్ అంటే పిల్లలు మాత్రమే ఆడుతారు అని చాలా మంది అనుకుంటారు. అయితే పెద్ద వాళ్లు సైతం పలు సందర్భాలలో వెరైటీ గేమ్స్ ఆడుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి.
మానసిక, శారీరక ఉల్లాసం కలిగించే ఆరోగ్యకరమైన గేమ్స్ అప్పుడప్పుడు ఆడాలని నిపుణులు కూడా చెబుతుంటారు. ఇటీవల స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. సోఫాకు అతుక్కుపోయి… గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడే రోజులొచ్చేశాయ్.
అయితే, కాలానుగుణంగా వచ్చిన ఈ మార్పులు.. చిన్నారులకి, పెద్దవాళ్లకి ఆరోగ్యపరంగా పెద్ద చిక్కులే తెచ్చిపెడుతున్నాయి.
ఫన్నీ గేమ్..
తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రెండు గ్రూపుల వ్యక్తులు తమ ఎదురుగా ఉన్న పెద్ద మొద్దులోకి మేకును కొట్టేందుకు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ఉంటారు.
నాగెల్బాల్కెన్ అని పిలువబడే ఈ రకమైన గేమ్ ఈవెంట్లు పండుగల సమయంలో కనిపిస్తుంటాయి. జర్మనీలో దీనిని ఎక్కువగా ఆడుతుంటారు.దీనిని నెయిల్ గేమ్ అని కూడా అంటారు.
ఆట నియమాల ప్రకారం, నిర్ణీత సమయంలో చెక్క స్టంప్‌లో ఎవరు ఎక్కువ లోపలికి కొడితే ఆ వ్యక్తి విజేతగా ప్రకటించబడతారు వీడియోలో, మొత్తం ఎనిమిది మంది పురుషులు ఉండగా, వారు రెండు గ్రూపులుగా విభజించబడ్డారు.
ఒక జట్టు నుండి ఒక పార్టిసిపెంట్ సుత్తితో మేకు కొట్టడానికి వస్తారు.. ఒక వ్యక్తి పూర్తి చేసిన వెంటనే, మరొక వ్యక్తి వెనక్కి పరిగెత్తాడు మరియు మరొకడు దానిని కొట్టడానికి వస్తాడు. మేకుని పూర్తిగా స్టంప్‌లో కొట్టిన జట్టు విజేతగా ప్రకటించబడుతుంది.
Men in men’s business > pic.twitter.com/2QFyzUD1r8
— Brincel — The Last Hairbender (@TheFineFeminine) October 23, 2022
ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో వుడీ మరియు క్లీనిల్ అనే యూజర్ పోస్ట్ చేసాడు. తర్వాత ఇది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించింది. ఈ వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
“ఒలింపిక్స్‌లో ఇలాంటివి పెడితే ఎక్కువ చూడగలిగేలా చేయగలవు.” “ఇది చాలా సరదాగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.