Saturday, May 18, 2024
Homecinemadivyanka tripathi : కాస్టింగ్ కౌచ్ పై నటి దివ్యాంక చేసిన వ్యాఖ్యలు వైరల్..!

divyanka tripathi : కాస్టింగ్ కౌచ్ పై నటి దివ్యాంక చేసిన వ్యాఖ్యలు వైరల్..!

Telugu Flash News

divyanka tripathi : క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. కాస్టింగ్ కౌచ్ వల్ల తాము కూడా నష్టపోయామంటూ ఇప్పటికే పలువురు దర్శకులు, నిర్మాతలపై పలువురు హీరోయిన్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురు నటీమణులు తమను లైంగికంగా వేధించారని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి దహియా కూడా కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో ఆఫర్లు, చేతిలో కాసులు లేని సమయంలో తనకు ఓ ఆఫర్ వచ్చిందని చెప్పింది. ఎంతో ఆనందంగా ఆడిషన్‌కి వెళితే, దర్శకుడితో ఒక్క రాత్రి గడిపితేనే ఓ వ్యక్తి తనకు అవకాశం ఇస్తాడని.. ఆ మాటలు విని షాక్ అయ్యానని చెప్పింది.

ఇండస్ట్రీలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని అనుకున్నానని, అందుకే ఆ ఆఫర్‌కి అప్పట్లో అంగీకరించకుండా అక్కడి నుంచి వచ్చేశానని చెప్పింది. ఇండస్ట్రీలో అలాంటి వారికి ఎవరూ లొంగిపోవద్దని దివ్యాంక స్పష్టం చేసింది. టాలెంట్‌పై నమ్మకం ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయి. అవకాశాల పేరుతో లైగింక బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టాలు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని.. అప్పుడే ఇండస్ట్రీలో మార్పులు వస్తాయన్నారు.

దివ్యాంక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దివ్యాంగ ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తుంది. ప్రస్తుతం దివ్యాంక ‘అదృశ్యం’ సీరియల్‌లో నటిస్తోంది. సీరియల్ నటుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి దివ్యాంక త్రిపాఠి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News