HomecinemaShruti Haasan : శృతి హాసన్ "చెన్నై స్టోరీ" సెట్స్ లో

Shruti Haasan : శృతి హాసన్ “చెన్నై స్టోరీ” సెట్స్ లో

Telugu Flash News

సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ (Shruti Haasan) , ఇప్పుడు చెన్నై స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా BAFTA విజేత పిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ది ఆరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్ సినిమాకి ఇండియన్ అడాప్షన్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం. తాజాగా శృతి హాసన్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

చెన్నై స్టోరీ సినిమా వేల్స్ మరియు ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వివేక్ కర్ల, నిమ్మి హరస్ గమ, సహన వాసుదేవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శృతి హాసన్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాను బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ యూకే గ్లోబల్ స్క్రీన్ ఫండ్ సహకారంతో గురు ఫిలిమ్స్, రిపిల్ వరల్డ్ పిక్చర్స్, లె లె ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సలార్ 2 షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ లో కూడా శృతి హాసన్ పాల్గొనబోతున్నారు. మొత్తం మీద శృతి హాసన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమా షూటింగ్ లు, మరోవైపు మ్యూజిక్ వీడియోలు, ఇలా ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News