Homeviral newsViral Video: భూమి బ‌ద్ద‌ల‌య్యేట్టు క్లాస్ రూంలో అరిచిన చిన్నారి..ఇంత ఎనర్జీ ఎక్క‌డిదంటున్న నెటిజ‌న్స్

Viral Video: భూమి బ‌ద్ద‌ల‌య్యేట్టు క్లాస్ రూంలో అరిచిన చిన్నారి..ఇంత ఎనర్జీ ఎక్క‌డిదంటున్న నెటిజ‌న్స్

Telugu Flash News

Viral Video: ఈరోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ ఎంత‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రతిరోజూ ఏదో ఒక వీడియో జనంలో చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు, మరొకొన్ని ప్రకృతిలో వింతలు.. పిల్లల అల్ల‌రి ప‌నులు ఇలా రకరకాలు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

అయితే మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే కొన్ని వీడియోలు అయితే తెగ ఆక‌ర్షిస్తుంటాయి. అలాంటి వీడియోలు ఎన్ని చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తాజాగా ఓ చిన్నారి బాలుడు క్లాస్ రూంలో గ‌ట్టిగా అరుస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏమి ఎనర్జీ..

ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే ఇందులో ఒక పిల్లవాడు బోర్డ్‌పై రాసిన వాటిని చ‌దువుతుంటే తోటి క్లాస్‌మేట్స్ కూడా అదే చెబుతున్నారు. ఇలాంటివి మ‌నం కూడా మ‌నం చిన్న‌ప్పుడు చేశాం.

అయితే ఇక్క‌డ విశేష‌మేమంటే ఆ బుడ‌త‌డు భూమి బ‌ద్ద‌ల‌య్యేట్టు ఫుల్ ఎన‌ర్జీతో గ‌ట్టిగా అరుస్తుండ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. గ‌ట్టి గ‌ట్టిగా హిందీ పేర్లను అరుస్తూనే ఉన్నాడు.

ఈ వీడియోకి బోత్రా .. “ఈ పిల్లవాడు పెద్దయ్యాక ఎలా అవుతాడో అని ఆలోచిస్తున్నారా. డ్రిల్ మాస్టర్ లేదా ఫుట్‌బాల్ కోచ్? లీడర్? లేదా టీవీ యాంకర్,… అంటూ కామెంట్ సెక్ష‌న్ లో రాసుకొచ్చారు.

-Advertisement-

చిన్న పిల్లవాడి ఉత్సాహం మరియు అసమానమైన శక్తి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.. ” నాకు కూడా ఇంత శక్తి కావాలి” అని నెటిజ‌న్ రాసుకొచ్చాడు. ఇలా ప‌లువురు ప‌లు కామెంట్స్ చేశారు.

అయితే కేవలం రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు 254,000 కంటే ఎక్కువ వ్యూస్ మరియు 3,500 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. సోష‌ల్ మీడియాలో చిన్న పిల్ల‌ల‌కు సంబంధించిన ఏ వీడియో అయిన తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తేనే ఉన్నాం కదా.

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News