prince movie review : విశ్వనాధం (సత్యరాజ్) ఆదర్శప్రాయమైన విలువలతో కూడిన వ్యక్తి. అతను తన ఊరిలో విభేదాలను తొలగించి ఐక్యతను ప్రోత్సహిస్తాడు. విశ్వనాధం కొడుకు ఆనంద్ (శివకార్తికేయన్) బ్రిటిష్ అమ్మాయి జెస్సికా (మరియా) ను ప్రేమిస్తాడు. సాధారణంగా ఓపెన్ మైండెడ్ అయిన విశ్వనాధం తన కొడుకు ప్రేమను తిరస్కరించినప్పుడు ఏమి జరుగుతుంది అనేది ప్రిన్స్ యొక్క ప్రధాన కథాంశం.
ఆనంద్, అదే ఈ సినిమా హీరో ప్రిన్స్, తన చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఆలోచనలను ఎలా మారుస్తాడు అనేది సినిమా మొత్తం కథ. శివకార్తికేయన్‌ని తన పెర్ఫార్మెన్స్ పూర్తిస్థాయిలో చూపించ తగ్గ సినిమా. ప్రిన్స్లో అతని ముందు సినిమాలో ఉన్న అంత ఎమోషనల్ మూమెంట్స్ లేవు కేవలం వినోదాన్ని ఆధారంగా చేసుకున్న సినిమా. అతని అభిమానులను లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా. మరియా బ్రిటీష్ అమ్మాయి ఎంపిక బాగాలేదు. హీరోయిన్ గా ఈ సినిమాను నిలబెట్టడంలో ఆ అమ్మాయి విఫలమైందనే చెప్పాలి. చుట్టూ ఏం జరుగుతుందో అర్ధం కానట్టు ఆమె ముఖంలో ఎక్సప్రెషన్స్ చూసిన ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తి సన్నగిల్లుతుంది.
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి ప్రిన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అతని ముందు సినిమా తరహా కామెడీ కనిపిస్తుంది. అయితే అటువంటి కామెడీ అన్ని సార్లు పనిచేయదనే సంగతి ఈ సినిమా ఫలితంతో అనుదీప్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కథలో కానీ కథనంలో గాని కొత్తదనం లేకపోవడం ప్రేక్షకుడు మొదటి సీన్ నుండే నిరాశపడతాడు. తర్వాతి సీన్లు ఎలా ఉంటాయో, కథ ఎలా మారుతుంది అనేది ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉన్న స్క్రీన్ ప్లే ఇంకా కూరగాయలకు ఇంగ్లీష్ పేర్లు వంటి అవుట్ డేటెడ్ కామెడీతో ప్రేక్షకుడికి నవ్వు రాదు సరికదా అసహనం మొదలవుతుంది.
మంచి ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత, సినిమా సీరియస్ గా మారుతుందనే ప్రేక్షకుడి ఆశ నిరాశ అయింది. సెకండాఫ్‌లో మరింత సిల్లీ కామెడీ ఉంది. దురదృష్టవశాత్తూ, చివరివరకు కథనం అలానే ఉండి ప్రేక్షకుడిని థియేటర్ నుండి అసంతృప్తితో వెళ్లేలా చేస్తుంది.
చిన్నచిన్న సంఘర్షణలకు సంబంధించిన సీన్లు కూడా చిన్నపాటి ఎమోషన్ తో మిగిలినదంతా హాస్యంతో ఉండడం వల్ల ఎమోషనల్ సీన్లలో కూడా ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు.
ఓవరాల్‌గా, ప్రిన్స్ అనేది జాతి రత్నాలు తరహా కామెడీతో నిండిన రొటీన్ కమర్షియల్ ఫేర్. దురదృష్టవశాత్తు, ఇది అనుకున్న విధంగా పని చేయలేదు. ఫస్ట్ హాఫ్ సిల్లీస్ట్ అండ్ అవుట్ డేటెడ్ హాస్యంతో పర్వాలేదనిపించినా, సెకండాఫ్ మాత్రం నిరాశ పరుస్తుంది.
హీరో, హీరోయిన్ నటన కాకుండా మిగిలిన నటుల నటనకు వస్తే , సత్య రాజ్ మరియు ప్రేమ్‌గి వంటివారి నటన మాత్రమే ఆకట్టుకుంటుంది మిగిలినవారి ప్రభావం పెద్దగా లేదు.
సంగీతం మరియు ఇతర విభాగాలు? ఎస్ థమన్ సంగీతం డీసెంట్‌గా ఉంది. పాటలు సమయానుకూలంగా చిత్రీకరించబడ్డాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ పల్లెటూరి నేపథ్యంలో సాగినప్పటికీ విజువల్స్ రిచ్ గా కనిపించాయి.
ఆర్ట్‌వర్క్ బాగుంది మరియు నిర్మాణ విలువలు పర్లేదనిపించాయి. ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. విడుదలకు ఒకరోజు ముందు పన్నెండు నిమిషాలు ట్రిమ్ చేశారు. సినిమా చూస్తుంటే,మరింత ఎడిట్ అవసరం ఉందని తెలుస్తుంది. డైలాగ్‌లు చాలా ఉన్నాయి ఇంకా నాన్‌స్టాప్‌గా వస్తూనే ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే ఆకట్టుకుంటాయి.
కొన్ని కామెడీ బ్లాక్స్ ఫస్ట్ హాఫ్, పార్ట్‌లలో డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ లోపాలు ఉన్నాయి. కాలం చెల్లిన కామెడీ నాసిరకం కథ పాత్రలతో సినిమా అంచనాలకు తగ్గట్టు ఆకట్టుకోలేకపోయింది.
Bottom line : ప్రిన్స్ కామెడీ అర్ధం కాని ప్రేక్షకుడు