బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ (liz truss) రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం అందరిని ఆశ్చర్యపరచింది. రాజకీయం పరంగా పెను సంక్షోభంలో కూరుకుపోవడమే లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి కారణమని అంటున్నారు.
లిజ్ ట్రస్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా కన్జర్వేటివ్స్ పార్టీ ఎంపీల నుంచే తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆమె తప్పక ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. లిజ్ ట్రస్ రాజీనామా పై సోషల్ మీడియాలో తెగ జోకులు పేలుతున్నాయి. అతి తక్కువ కాలం ప్రధానిగా లిజ్ చేయడంతో ఆమెని ఆడేసుకుంటున్నారు.
ట్వీట్ వైరల్
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫన్నీ ట్వీట్స్‌తో నెటిజన్స్‌ని అలరిస్తూ ఉండే వసీం జాఫర్ (wasim jaffer) తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.
టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) లో పాల్గొనే జట్ల కోసం విశ్లేషణ చేశాను.
- ఇండియా 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్ లేదు.
- పాక్‌కు అనుభవజ్ఞుడైన ఫినిషర్ లేరు.
- ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్‌కు గొప్ప రికార్డు లేదు.
- శ్రీలంక టీంలో సరైన అనుభవజ్ఞులు లేరు.
- ఇంగ్లండ్‌కు ప్రధాన మంత్రి లేరు.
అని వసీం జాఫర్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కి భారీ రెస్పాన్స్ దక్కింది. 20000కి పైగా లైక్‌లు మరియు దాదాపు 1300 రీట్వీట్‌లతో వైరల్‌గా మారింది. T20 ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్ల గురించి విశ్లేషణ చేస్తూ.., భారతదేశానికి 150 కిమీ వేగంతో వేయగల బౌలర్ లేడని మరియు ‘ఇంగ్లాండ్‌కు ప్రధానమంత్రి లేడని’ గ్రహించానని జాఫర్ రాయడం ఆసక్తికరంగా మారింది.
Was doing a SWOT analysis for T20 WC participating teams and realised:
India don't have a 150K+ bowler.
Pak don't have a seasoned finisher.
NZ don't have a great record in Aus.
SL don't have an experienced squad.
England don't have a Prime Minister. #T20worldcup22 #LizTruss— Wasim Jaffer (@WasimJaffer14) October 20, 2022
ఇక లిజ్ ట్రస్ తన రాజీనామా గురించి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంక్షోభం ఓవైపు.. రాజకీయ అనిశ్ఛితి మరోవైపు.. వెరసి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం వల్లనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన అధికారిక నివాసం బయట మీడియాతో మాట్లాడుతూ లిజ్ ట్రస్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధానిగా స్వల్ప కాలం పనిచేసిన వారిలో జార్జ్ కానింగ్ కూడా ఉన్నారు 1827 లో జార్జ్ 119 రోజులు బ్రిటన్ ప్రధానిగా కొనసాగారు. గత ఆరేళ్లలో లిజ్ ట్రస్ బ్రిటన్‌కి ఆరో ప్రధాని.
ఇవి కూడా చూడండి :
అందానికి ఆ నాలుగు విటమిన్లు
మీ ఇంట్లో 4 మొక్కల ను పెంచుకోండి … ప్రయోజనాలు ఇవే …