Viral Video: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది. పెళ్లి ఘడియలు దగ్గరకు వస్తున్నాయంటే చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు. పొద్దున్నే నిద్ర లేవడం, అందంగా కనపడేందుకు మేకప్ గట్రా వేసుకోవడం, కుటుంబం, స్నేహితులను విడిచిపెట్టి కొత్త కుటుంబంలోకి వెళుతున్నామనే ఒత్తిడి వధువుకి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ వీడియో లో కనిపిస్తున్న వదువు వాటన్నింటిని పక్కకు పెట్టేసి ఎంతో రిలాక్స్‌డ్ గా కనిపిస్తుంది. హాయుగా తనకు ఇష్టమైన ఆహారాన్ని అంటే పిజ్జాను తింటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా, ఈ వైరల్ వీడియోలో, వధువు తన పెళ్లికి ముందు పిజ్జాను ఆస్వాదించడాన్నిమనం గమనించవచ్చు.
ఏం పిచ్చి..
వీడియోలో వధువు సాంప్రదాయ వివాహ దుస్తులను పూర్తిగా ధరించి, పిజ్జా బాక్స్ ఒళ్లో పెట్టుకొని కుర్చీపై కూర్చోవడం మనం చూడవచ్చు. వీడియో అప్‌లోడ్ చేయబడినప్పటి నుండి, ఇది 431K వ్యూస్ , 6.9K లైక్‌లు రాబట్టింది.
View this post on Instagram
ఈమెకి సంబంధించిన మరో వీడియో కూడా వైరల్ అయింది. పింక్ లెంహగా ధరించి అందంగా రెడీ అయిన వధువు వరుడితో విసిగిపోయి కనిపించింది. బారాత్ సమయానికి రాకపోవడంతో కాస్త చిరాకు పడ్డట్టు కనిపించింది.
ఆమె ఆత్రుతగా ఎదురు చూడగా, వారు సరైన సమయానికి రాకపోవడంతో ఒత్తిడికి లోనయినట్ల కనిపిస్తోంది. కోపంగా స్పందిస్తూ, పెళ్లికి రావద్దని వరుడిని కోరింది. అయితే, ఒక క్షణం తర్వాత, వధువు మళ్లీ “జల్దీ నిక్లో యార్, అని చెప్పడం మనం గమనించవచ్చు.
View this post on Instagram
మొత్తానికి ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే పిజ్జా అంటే ఇష్టపడే మహిళలు చాలా సంబంధాలు కూడా పోగొట్టుకున్న సందర్భలు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి :
తీయని పాట మీ గొంతులో పలకాలంటే… ఇలా చేయండి.
రాత్రిపూట తలస్నానం చేస్తే..నష్టమా ? లాభమా ?