HomesportsAsia Cup: ఆసియా క‌ప్ కోసం భార‌త్ పాకిస్థాన్ కి వెళ్ల‌దు.. జై షా కీల‌క వ్యాఖ్య‌లు

Asia Cup: ఆసియా క‌ప్ కోసం భార‌త్ పాకిస్థాన్ కి వెళ్ల‌దు.. జై షా కీల‌క వ్యాఖ్య‌లు

Telugu Flash News

Asia Cup: భార‌త్ – పాక్ మ్యాచ్ అంటే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ రెండు దేశాలు క్రికెట్ మ్యాచ్ ఆడుతుండ‌డంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతుంటాయి. అభిమానులు అయితే క్రికెట్‌ను మించి అనేలా భావిస్తుంటారు. మ్యాచ్ గెలుపోట‌ముల విష‌యంలో అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు గురి అవుతుంటారు.

రెండు జట్ల మధ్య మ్యాచ్‌గా కంటే రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంగా క్రికెట్‌ని భావించ‌డం విశేషం. అయితే రాజకీయ కారణాలతో భారత జట్టు ఒకటిన్నర దశాబ్ద కాలంగా పాకిస్థాన్ లో పర్యటించడం మానేసిన విష‌యం తెలిసిందే.

త‌గ్గేదే లే

అయితే వచ్చే ఏడాది ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండ‌గా, ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. ఆసియా స్థాయిలో ఇది ప్రధాన టోర్నీ కాగా, టీమిండియా తప్పక ఆడాల్సి ఉంటుందని, అందుకే ఈ టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు.

ఇక భారత్ చివరిసారిగా పాకిస్థాన్ లో 2008లో పర్యటించింది. అప్పట్లో ఆసియా కప్ టోర్నీని వన్డే ఫార్మాట్ లో నిర్వహించగా, ఆ టోర్నీలో భారత్ పాల్గొని ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో శ్రీలంక విజేత గా నిలిచింది.

భారత-పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయ వైరుధ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ ‘సంబంధాలు’ కూడా త‌గ్గుతూ వ‌చ్చాయి. 2013 నుంచి ఉభయ దేశాల జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడ‌డ‌మే మానేసింది.

ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ లో టీమిండియా రెండు సార్లు పాక్ ని ఎదుర్కొనగా, ఇండియా ఒక‌సారి పాకిస్తాన్ ఒక‌సారి గెలిచాయి.

-Advertisement-

ఇక ఈ నెల 23 న మెల్ బోర్న్ లో టీ-20 వర‌ల్డ్ కప్ టోర్నమెంట్ లో రెండు జట్లూ ఢీకొననుండ‌గా, ఈ మ్యాచ్ కోసం ప్ర‌తి ఒక్కరు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చూడండి : 

వయస్సు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..

పిల్లల్లో జ్వరానికి భయపడద్దు.. ఇలా చేయండి..

సాయంత్రం ఆరు దాటాక చేయకూడని పనులు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News