Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలలో పలు మార్పులు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి పైపైకి వెళ్లిన బంగారం ధర మళ్లీ తగ్గుతూ ఉంటుంది. అయితే శనివారం రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 46,750గా ఉంది. శుక్రవారం కూడా దాదాపు ఇదే ధర పలకడం మనం చూశాం.
ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర కూడా మారలేదు. ప్రస్తుతం రూ. 51,000గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,10,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,900గా ఉండగా, .. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,150గా కొనసాగుతుంది.
మార్పులు ఏమైన ఉన్నాయా..
కోల్కతా చూస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 46,750 పలుకుతుండగా,. 24 క్యారెట్ల గోల్డ్.. 51,000గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు పలుకుతున్నాయి.
ఇక చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,650గా కొనసాగుతుంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 46,760గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,010గా ఉంది.
హైదరాబాద్ విషయానికి వస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,750గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,000గా పలుకుతుంది.. విజయవాడలో , విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,800గా ఉండగా, .. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 51,050గా పలుకుతుంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,750గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,000గా పలుకుతుంది.
దేశంలో వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,730గా ఉండగా, కేజీ వెండి ధర రూ. 57,300కి చేరింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 62,300 గా ఉంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 57,300.. బెంగళూరులో రూ. 62,300గా పలుకుతున్నాయి.