HomedevotionalHoroscope Today: 15-10-2022 శనివారం రాశి ఫలితాలు..

Horoscope Today: 15-10-2022 శనివారం రాశి ఫలితాలు..

Telugu Flash News

Horoscope Today:

మేష రాశి (mesha rashi):

ఈ రాశి వారికి నేడు ఖ‌ర్చులు ఎక్కువ అవుతాయి. విభేదాల‌కు దూరంగా ఉంటే మంచిది. శుభ ఫ‌లితాల కోసం శివారాధ‌న చేస్తే మంచిది. నువ్వుల నూనెతో దీపారాధ‌న చేయాలి. ఆరోగ్యం ప‌ట్ల కూడా ప్ర‌త్యేక దృష్టి స్టారించాలి.

వృషభ రాశి (vrushaba rashi)

ఈరోజు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు వ‌స్తాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు.

మిథున రాశి (mithuna rashi)

-Advertisement-

ఈ రాశి వారికి ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉంటాయి.మాన‌సిక ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. చికాకులు ఎక్కువ‌గా ఉంటాయి. కుటుంబములో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణములో ఖర్చులు భాగా పెరుగుతాయి.

కర్కాటక రాశి (karkataka rashi)

ఈరోజు మీరు చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబములోని సమస్యలు అన్ని తొల‌గిపోవ‌డ‌మే కాక కొత్త‌గా వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. ఇలాంటి వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది.

సింహ రాశి (simha rashi)

ఈ రాశి వారు చేప‌ట్టిన‌ ప్రతీ పనిని పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు ఇది కాగా, శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండ‌డం మంచిది.

కన్యా రాశి (kanya rashi)

ఈరోజు ప్రయాణములు బాగా అనుకూలిస్తాయి. మీ అవసరాల కోసం డబ్బులు ఎక్కువ‌గా ఖర్చు చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది.

శత్రువులపై విజయము సాధించ‌గ‌లుగుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.

Horoscope Today

తులా రాశి (tula rashi)

ఈరోజు ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది. ప్రయాణములు బాగా అనుకూలిస్తాయి . కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. అప్పుల ఒత్తిడి ఉండ‌డం వ‌ల‌న ఇబ్బంది ప‌డ‌తారు. మిత్రులు కొంత సాయ ప‌డ‌తారు. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృశ్చిక రాశి (vrushchika rashi)

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. . మీ అవసరాల కోసం డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. ఇష్టమైన వస్తువులు కొంటారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము ఉండ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. మీకు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఎదుర‌వుతుంది. శత్రువులు మిత్రులుగా మార‌తారు.

ధనుస్సు రాశి (dhanusu rashi)

ఈరోజు మీరు శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణములు ఎక్కువ‌గా చేస్తారు. సమస్యలు సులువుగా ప‌రిష్కారం అవుతాయి. గొడవలకు దూరంగా ఉండడం వ‌ల‌న మానసిక ఆందోళన త‌గ్గుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులు కొంత చిరాకులు ప‌డ‌తారు.

మకర రాశి (makara rashi)

ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండ‌డం మంచిది. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. చేసే ప్రతి పనిని ఆచితూచీ జాగ్రత్తగా చేయడం అవ‌స‌రం.

కుంభ రాశి (kumba rashi)

ఈరోజు కుంభరాశివారిపై ఒత్తిడి తీవ్రముగా ఉంటుంది. కాబట్టి చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువుల వల్ల బాధలు ఎక్కువ అయ్యే అవ‌కాశం ఉంది.. ఉద్యోగములో సమస్యలు పెరుగుతాయి.. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

మీన రాశి (meena rashi)

ఈరోజు మీరు అన్ని విష‌యాల‌లో సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. మానసికంగా ఉల్లాసం లభిస్తుంది. ప్రతి పనిలో విజయాన్ని సాధించ‌డం వ‌ల‌న ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వ‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News