Sourav Ganguly: ఒకప్పుడు భారత క్రికెటర్‌గా, టీమిండియా కెప్టెన్‌గా గంగూలీ హవా ఏ రేంజ్‌లో నడిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా కూడా సౌరవ్ గంగూలీ తన సత్తా చాటారు.
1983 ప్రపంచకప్ విన్నర్ రోజర్ బిన్నిని తదుపరి ప్రెసిడెంట్ కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగికరించారని, గంగూలీని పదవిని వదులుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఐసీసీ ప్రెసిడెంట్ రేసులో దాదా పోటీ పడాల్సి ఉంటుంది, లేకుంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవి తీసుకోవాలని ఆఫర్ చేసినట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
అదే కారణమా?
సబ్ కమిటీకి ఛైర్మన్‌గా ఆఫర్ వచ్చిన కూడా, అలా ఉండటం ఇష్టం లేని దాదా.. తిరస్కరించినట్టు సమాచారం. “సౌరవ్ గంగూలీకి ఐపీఎల్ ఛైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చారు.
అయితే ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది. బీసీసీఐకి హెడ్‌గా చేసిన తర్వాత అందులోని సబ్ కమిటీకి ఛైర్మన్‌గా ఉండకూడదని నిర్ణయం తీసుకోగా, బీసీసీఐ అధ్యక్ష పదవిలోనే కొనసాగాలని అనుకున్నారట.
జై షా సెక్రటరీగానే కొనసాగనుండగా.. రాజీవ్ శుక్లా వైస్ ప్రెసిడెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అరుణ్ సింఘ్ ధూమల్ ఐపీఎల్ చైర్మన్ అయ్యే అవకాశాలున్నాయని ఇన్ సైడ్ టాక్.
గంగూలీని కావాలనే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తున్నారనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. బీజేపీ రాజకీయాలకు దాదా బలయ్యాడని, తృణముల్ కాంగ్రెస్ పార్టీతో అతనికి ఉన్న సాన్నిహిత్యం వల్లనే బీజేపీ అతనిని తొక్కేసిందనే వాదన కూడా లేకపోలేదు.
బీజేపీలో చేరేందుకు దాదా సిద్దంగా లేకపోవడంతోనే ఆ పార్టీ పెద్దలు అతనిపై ఆగ్రహంగా ఉన్నారని, ఈ క్రమంలోనే అతన్ని బీసీసీఐకి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చర్చలు నడుస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.