Horoscope Today:
11-10-2022 మంగళవారం రాశి ఫలాలు
మేషం
ఈ రాశివారికి నేడు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని విషయాల్లో తోటివారిని కలుపుకోని వెళ్లడం మంచిది. ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. చంద్ర ధ్యాన శ్లోకం పఠిస్తే మేలు కలుగతుంది.
వృషభం
ఈ రాశి వారికి కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇష్టదైవారాధన చేయడం వలన సానుకూల ఫలితాలు అందుకుంటారు.
మిథునం
ఇక ఈ రాశి వారు సకాలంలో చేపట్టిన పనులు పూర్తవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచింది. సంబంధంలేని వ్యవహారాలు, పనుల్లో తలదూర్చకుండా ఉండటం మీకు మంచిది.
కర్కాటకం
ఈ రాశివారికి అన్ని సమయాలలో అనుకూల ఫలితాలు కలుగుతాయి. స్థిరాస్తి విషయంలో కొంత సానుకూలత లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి రావడం వలన సంతోషగా ఉంటారు.
సింహం
సమయస్ఫూర్తి, తెలివితో సమస్యలను ఎదుర్కొంటారు . భవిష్యత్ ప్రణాళికల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, మీకు పరిస్థితలు అన్ని బాగుంటాయి. కొందరితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య దేవుడిని పూజిస్తే మీకు మంచి కలుగుతుంది.
కన్య
ఈ రాశివారు చేపట్టిన రంగాల్లో ఆచితూచి వ్యవహరించితే మంచిది. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా జాగ్రత్తపడాలి. ఆలస్యం చేయరాదు. గణపతి సహస్రనామ పారాయణంతో మంచి ఫలితాలు అదుకునే అవకాశం ఉంది.
తుల
మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అనవసర వివాదాలు కొని తెచ్చుకోవడమే కాక అన్ని పనుల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. శ్రీరామరక్ష స్తోత్రం చదివితే అందరికి శుభం కలుగుతుంది.
వృశ్చికం
ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నతిని సాధించడం వలన ఆనందం పొందుతారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలు వస్తాయి మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనవరసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
ధనస్సు
ముఖ్యమైన పనులు, ఇతర వ్యవహారాలలో ఓపికతో ఉండాలి, విరోధుల విషయంలో కొంత విజయం సాధిస్తారు. చెడు సహవాసానికి దూరంగా ఉంటే మంచిది. ఎవరిని ఎక్కువగా నమ్మోద్దు.
మకరం
కీలక పనులు, వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటిస్తారు. ఆ క్రమంలో సానుకూల ఫలితాలు పొందుతారు. ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయి బాబాను దర్శించుకుంటే మీకు శుభం కలుగుతుంది.
కుంభం
బద్ధకం అస్సలు పనికిరాదు. దాని వలన కొన్ని పనులలో ఆటంకాలు కలుగుతాయి . ఇక చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
మీనం
సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో సమస్యలను అధిగమిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొనడం వలన సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం వలన మానసిక ఆనందం పొందడం జరుగుతుంది. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.