HomecinemaIleana | Depression | ప్రసవం తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌తో పోరాడిన ఇలియానా

Ileana | Depression | ప్రసవం తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌తో పోరాడిన ఇలియానా

Telugu Flash News

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇలియానా (Ileana) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2006లో విడుదలైన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, తర్వాత వరుస సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమాలో నటించి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత రామ్, సిద్ధార్థ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్.టి.ఆర్., ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఇలియానా, 2012లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే, గత ఏడాది ఇలియానా ఒక షాకిచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఆమె, ఆగస్టులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తన ప్రియుడు తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె, తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది.

ప్రస్తుతం బిడ్డతో సమయాన్ని గడుపుతూ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఇలియానా, సినిమాలపై ఏ ప్రకటన చేయలేదు.

అయితే, టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా ప్రసవం తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌ (Depression) తో పోరాడారని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సమయంలో తన భాగస్వామి మైఖేల్ డోలన్‌కు తనకు మంచి సపోర్ట్‌గా ఉన్నారని తెలిపారు.

-Advertisement-

“ప్రసవం అనంతరం నాకు తీవ్రమైన డిప్రెషన్ కి గురయ్యాను. నాకు ఏమి చేయాలో తెలియక నా గదిలో ఒంటరిగా ఉంటూ ఏడ్చాను. నా కొడుకు వేరే గదిలో నిద్రిస్తున్నాడు. అందుకే నేను అతన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. వైద్యులు నాకు మంచి చికిత్స అందించారు. వారికి  నా ధన్యవాదాలు” అని ఇలియానా తెలిపారు.

“బిడ్డ పుట్టిన తర్వాత మా ఇద్దరికీ తీవ్రమైన భావోద్వేగాలు కలిగాయి. ఇప్పటికీ వాటిని అనుభవిస్తున్నాను. మైక్ నాకు నిజంగా అద్భుతమైన భాగస్వామి. అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి, ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటాడు” అని ఇలియానా చెప్పారు.

ప్రసవం తర్వాత డిప్రెషన్ అనేది చాలా మంది మహిళలను వేధించే సమస్య. దీనిని ఎదుర్కోవడానికి సమయం, సహాయం అవసరం. ఇలియానా మాదిరిగానే ఈ సమస్యను ఎదుర్కొంటున్న మహిళలు దీని గురించి సిగ్గుపడకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

 

also read :

Ileana : నటి ఇలియానా కొడుకుని చూశారా ? పేరు ఏంటో తెలుసా ? ఫోటో వైరల్!

Ileana: బిడ్డ తండ్రి ఎవ‌రో చెప్ప‌కుండా.. ఇలా వ‌రుస బేబి బంప్ ఫోటోల‌తో ఇలియానా ర‌చ్చ‌

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News