HomecinemaGuntur Karam : మహేష్ బాబు స్టెప్పులు వారెవా!!

Guntur Karam : మహేష్ బాబు స్టెప్పులు వారెవా!!

Telugu Flash News

Guntur Karam : సూపర్ స్టార్ మహేష్ బాబు దృష్టి మొత్తం ఇప్పుడు గుంటూరు కారం మూవీ పైనే ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్‌లో మరో సూపర్ హిట్ ఇవ్వాలని ఆయన సిద్ధమయ్యాడు.

ఈ సినిమాలో మహేష్ బాబు డాన్సుల విషయంలో ఎక్కడా తగ్గకుండా చాలా కష్టపడుతున్నాడు. చాలా కాలంగా ఈయన సినిమాలలో డాన్సులు పెద్దగా కనిపించలేదు. ముందు వచ్చిన సినిమాలు సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట సినిమాలలో ఒకటి రెండు పాటల్లో స్టెప్పులు బాగానే వేసినా కూడా పూర్తిగా మాస్ మాత్రం కాదు. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఆ బాకీ మొత్తం తీర్చేస్తున్నాడు మహేష్.

తాజాగా విడుదలైన కుర్చీ మడత పెట్టి అనే పాటలో మహేష్ బాబు స్టెప్పులు చూస్తుంటే వారెవా అనకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. ఈ పాటలో మహేష్ బాబు డాన్స్‌లో వేగం, శక్తి చాలా బాగా కనిపిస్తున్నాయి. పాటలో శ్రీలీల కూడా చాలా బాగా డాన్స్ చేస్తుంది.

ఈ పాటకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేసిన పని అద్భుతం. మహేష్ బాబును ఇప్పటివరకు చూసినట్లు కాకుండా వేరే లెవెల్ డాన్స్ చేయించాడు. శేఖర్ మాస్టర్ ఈ పాట కోసం మహేష్ బాబును చాలా కష్టపెట్టాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు నుండి బెస్ట్ డాన్స్ పెట్టించాలని చూశాడు.

మొత్తానికి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు డాన్స్‌తో అదరగొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు కెరీర్‌లో మరో మైలురాయి సృష్టించాలని ఆశిస్తున్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News