Homecinemaపార్టీ కోసం చిరంజీవి ఆస్తులు అమ్మేశారు..నిర్మాత ఎన్వీప్రసాద్

పార్టీ కోసం చిరంజీవి ఆస్తులు అమ్మేశారు..నిర్మాత ఎన్వీప్రసాద్

Telugu Flash News

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈసినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత చిరు ఖాతాలోకి హిట్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భాగ్యనగరంలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్.

అయితే ఈ కార్యక్రమంలో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ.. జనసేన గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. ప్రజారాజ్యం పార్టీ కోసం చిరు అమ్ముడు పోయారు అంటున్నారు. కానీ తన ఆస్తులు అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేసే రోజు అప్పులు తీర్చారు అని చెప్పారు.

జనసేన  బాధలో నుంచి పుట్టింది..

నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. “చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఎన్నికలు మొత్తం మేము దగ్గరుండి చూసుకున్నాము. ఆయన తిరుపతిలో పోటీ చేస్తే అక్కడి లోకల్ లీడర్లతో మాట్లాడాము.

ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరు చాలా ఇబ్బంది పడ్డారు.ఇప్పటి వరకు ఆయనకు కూడా తెలియని విషయం ఇప్పుడు చెబుతున్నాను. చాలా మంది ఆయన అమ్ముడు పోయారని అంటున్నారు.

కానీ మద్రాసు ల్యాబ్ పక్కన ఉన్న కృష్ణ గార్డెన్ ప్రాపర్టీ అమ్మి ఆయన పార్టీ క్లోజ్ చేసే రోజు అప్పులు తీర్చారు. అంతపెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి చిరు. ఈ విషయం ప్రపంచానికి తెలియదు” అన్నారు.

“ఆయన గురించి ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారు. ఏది పడితే అది రాస్తున్నారు. ధైర్యం ఉంటే నా గురించి రాయమని చెప్పండి. ఏ ఒక్కరు ముందుకు రారు.

-Advertisement-

కానీ చిరంజీవి (Chiranjeevi) గురించి మాత్రం ఇష్టం వచ్చినట్లు రాసేస్తారు. ఎందుకంటే ఆయన ప్రత్యేకం కాబట్టి.కళ్యాణ్ బాబు గురించి ఏం అన్నా పట్టించుకోరు. కానీ చిరు గురించి మాట్లాడితే మాత్రం పవన్ నేరుగా రోడ్డు మీదకు వచ్చేస్తారు.

ప్రజారాజ్యం బాధలో నుంచి పెట్టిందే జనసేన. ఆరోజు చిరంజీవి గురించి ఏది మాట్లాడిన వాటికి సమాధానమే జనసేన. అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడినా.. రాసిన ఆలోచించండి” అంటూ చెప్పుకొచ్చారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News