Mustard: చూడ్డానికి చాలా చిన్నగా ఉండే ఆవాలుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.ఆవాలులో రెండు రకాలు ఉంటాయి. నలుపు ఆవాలు, తెలుపు ఆవాలు. ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
ఆవాల్లో డైటరీ ఫాట్స్, కార్బోహైడ్రేట్స్, ఫాట్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, బి1, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కె, జింక్, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటివి ఎక్కువ మోతాదులో ఉన్నాయి. గోరు వెచ్చని నీటిలో కాసిన్ని ఆవాలు వేసి.. ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలకు కూడా ఆవ పొడితో చెక్ పెట్టవచ్చు. ఆవ మిశ్రమాన్ని వాటిపై రాయడం ద్వారా మంచి ఉపశనమం కలుగుతుంది.
ఇలా చేయండి..
ఆవాల ముద్దను, కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.చర్మంపై ఏర్పడే పులిపిర్లను తొలగించడానికి కూడా ఆవ పొడి బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు .
ప్రతిరోజూ నాలుగు గ్రాముల ఆవాలను తినటం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆవాలతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయని అంటున్నారు.. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది.
జుట్టు రాలిపోవటం, బట్టతల ఏర్పాడే లక్షణాలు కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాస్తే మీ తలపై కొత్త వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంది.
ఎక్కువగా వాంతులు, నీళ్ల విరేచనాలవుతుంటే.. ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకుంటే ఉపశమనం ఉంటుంది. ఆవాలతో తయారుచేసిన నూనెను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది.
ఈ నూనెలో న్యూటియన ఫాక్ట్స్ ఎక్కువ. చేపల కూరలో ఈ ఆవాలపొడి చేర్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి.