philippines earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిండానావో ద్వీపం వరుస భూకంపాలతో వణికిపోతోంది. గత శనివారం 7.6 తీవ్రతతో బలమైన భూకంపం వచ్చిన తర్వాత, ఆదివారం సాయంత్రం 6.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. తాజాగా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మరోసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ఈ భూకంపాల కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భూకంపాల వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. అయితే, భూకంపాల వల్ల కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది.
ఫిలిప్పీన్స్లో భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ దేశం “రింగ్ ఆఫ్ ఫైర్”పై ఉంది. ఇది భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలకు అవకాశం ఉన్న పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ప్రదక్షిణ చేసే అగ్నిపర్వతాల బెల్ట్.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ భూకంపాల కారణంగా నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.