HomecinemaSalman Khan: త‌న డూప్ మృతి చెంద‌డంతో ఫుల్ ఎమోష‌న‌ల్ అయిన స‌ల్మాన్ ఖాన్

Salman Khan: త‌న డూప్ మృతి చెంద‌డంతో ఫుల్ ఎమోష‌న‌ల్ అయిన స‌ల్మాన్ ఖాన్

Telugu Flash News

Salman Khan: ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ లో ఈ మధ్య కృష్ణం రాజు మృతి చెంద‌గా, ఆ త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు క‌న్నుమూసారు. ఇక బుధ‌వారం మ‌హేష్ త‌ల్లి ఇందిరా దేవి మృతి చెందారు. వీరి మ‌ర‌ణాల‌తో ఇండ‌స్ట్రీ ఒక్క‌సారి విషాదంలో మునిగింది. ఇక ఈ విషాదం నుండి కోలుకోక‌ముందే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ డూప్ సాగ‌ర్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం స‌మ‌యంలో జిమ్ చేస్తుండ‌గా, గుండెపోటుతో క‌న్నుమూసారు. 50 ఏళ్ల వయ‌స్సులో సాగ‌ర్ మృతి చెంద‌డం ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

విషాదం..

బాలీవుడ్ పరిశ్రమలోని ప్రముఖులు సాగర్ ఫొటోను షేర్ చేస్తూ సంతాపం తెలియ‌జేస్తున్నారు. ఇక ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే సాగర్.. అకస్మాత్తుగా మరణించడం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేస్తుంది.సల్మాన్ ఖాన్‌తో కలిసి 50కి పైగా చిత్రాలలో కనిపించారు సాగర్ పాండే. ‘బజరంగీ భాయిజాన్’, ‘ట్యూబ్‌లైట్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’, ‘బిగ్ బాస్’ వంటి టీవీ షోలలో సల్మాన్ ఖాన్ కోసం సాగర్ పాండే డూప్ గా పని చేసిన విష‌యం విదిత‌మే. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా స్టేజ్ షోలు చేసి పలువురి మెప్పు పొందిన సాగ‌ర్ ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

సాగర్ పాండే మరణం పట్ల సల్మాన్ ఖాన్ సంతాపం తెలిపారు. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘నాతో ఉన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సాగర్ పాండే..’ అంటూ స‌ల్మాన్ చాలా ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. సాగ‌ర్ క‌రోనా స‌మ‌యంలో చాల ఇబ్బందులు ప‌డ్డాడు. ఆ స‌మ‌యంలో తన ఖర్చుల కోసం సల్మాన్ ఖాన్ ప్రతి నెల డబ్బులు పంపించాడ‌ట‌. సాగర్ పాండే కూడా సల్మాన్ ఖాన్‌లా బ్యాచిల‌ర్‌గానే ఉన్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News