Viral Video: సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా పాములకి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని వీడియోలు చూస్తే గగుర్పాటుకి గురవ్వడం ఖాయం. అంతలా వణికిస్తున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతుండగా, ఇందులో కోబ్రా స్కూల్ బ్యాగ్‌లోకి దూరి ప్రశాంతంగా నిద్రించింది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసే స్కూల్ పిల్లల పరిస్థితేంటి ? అది కూడా విషపూరితమైన నాగు పాము కనుక అది కరిస్తే ఏమైన ఉందా? ఈ ఘటనను ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి.
ధైర్యమే చేశాడు..
మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌లో వెలుగు చూసిన ఘటనలో బదోని స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఉమ రజక్ అనే బాలిక స్కూల్ కి వెళ్లిన అనంతరం తన బ్యాగులో ఏదో కదులుతున్నట్టు గుర్తించింది. దాంతో ఒక్కసారిగా బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దామని అనుకుంది, కాని అంత సాహసం అయితే చేయలేకపోయింది.
ఈ విషయాన్ని స్కూల్ టీచర్‌కి చెప్పగా, దాంతో స్కూల్ టీచర్ అందులో స్నేక్ ఉన్నట్టు గుర్తించి బ్యాగ్‌తో చాలా దూరం వెళ్లాడు. నిర్జన ప్రదేశంలో స్కూల్ బ్యాగు జిప్ ఓపెన్ చేశాడు. అందులో ముందుగా బుక్స్ బయటకు తీసాడు. ఆ తర్వాత పాముని బయటకు తీసే ప్రయత్నం చేయగా, అస్సలు బయటకు రావడం లేదు.
కొంచెం గట్టిగా దులపడంతో అప్పుడు కనిపించింది ఒళ్లు గగుర్పొడిచే సీన్.. అందులోంచి బుసలు కొడుతున్నట్టుగా పడగ విప్పిన నాగు పాము బయటికొచ్చింది. ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అయితే నాగుపాము బ్రతికాను రా అంటూ అక్కడ నుండి మెల్లగా జారుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
कक्षा 10 की छात्रा कु. उमा रजक के बैग से, घर से स्कूल आकर जैसे ही बैग खोला तो छात्रा को कुछ आभाष हुआ तो शिक्षक से शिकायत की, कि बस्ते में अंदर कुछ है, छात्रा के बैग को स्कूल के बाहर ले जाकर खोला तो बैग के अंदर से एक नागिन बाहर निकली, यह घटना दतिया जिले के बड़ोनी स्कूल की है। pic.twitter.com/HWKB3nktza
— Karan Vashistha BJP 🇮🇳 (@Karan4BJP) September 22, 2022