HomehealthSnoring : గురక తగ్గాలంటే.. ఈ 5 చిట్కాలు పాటించండి!

Snoring : గురక తగ్గాలంటే.. ఈ 5 చిట్కాలు పాటించండి!

Telugu Flash News

Snoring : పడుకునేటప్పుడు పక్కనే పడుకున్నవారు గురక పెడుతుంటే ఆ సమస్య అంతా ఇంతా కాదు. గురక పెట్టేవారి పక్కన పడుకోవడం వల్ల వారికి నిద్ర పట్టదు. ఈ క్రమంలో ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది. అయితే కింద పేర్కొన్న చిట్కాలను పాటిస్తే గురక సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. మరియు ఆ చిట్కాలు ఏమిటంటే…

  1. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు చుక్కల పెప్పర్‌మింట్ ఆయిల్ మీ నోటిలో వేసుకుని పుక్కిలించాలి.
  2. కొద్దిగా పిప్పరమెంటు నూనెను వేళ్లకు రాసుకుని వాసన చూస్తే గురక తగ్గుతుంది.
  3. అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  4. మరుగుతున్న నీటిలో 4-5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి, పడుకునే ముందు ఆవిరి పట్టాలి. దీంతో గురక సమస్య నుంచి బయటపడవచ్చు.
  5. ఒక గ్లాసు వేడి నీటిలో అర టీస్పూన్ యాలకుల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. గురక సమస్య తగ్గుతుంది.
-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News