HomecinemaArjun Kapoor - Malaika Arora : ఆమె పెళ్ల‌ప్పుడు చిన్న బుడ‌త‌డు..ఇప్పుడు ఆమెతోనే ప్రేమ‌లో..!

Arjun Kapoor – Malaika Arora : ఆమె పెళ్ల‌ప్పుడు చిన్న బుడ‌త‌డు..ఇప్పుడు ఆమెతోనే ప్రేమ‌లో..!

Telugu Flash News

Arjun Kapoor – Malaika Arora Love: ప్రేమ ఎప్పుడు ఎవ‌రి మ‌ధ్య అయిన పుట్టొచ్చు. ప్రేమ‌కి వ‌య‌స్సు,కులం, మ‌తంతో సంబంధం లేదు. సినిమా ప్ర‌ముఖుల‌లో చాలా మంది త‌మ‌కన్నా పెద్ద వారిని వివాహాలు చేసుకున్న విష‌యం తెలిసిందే.

అయితే బాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా ,యంగ్ హీరో అర్జున్ కపూర్ ల‌వ్ ట్రాక్ కాస్త డిఫ‌రెంట్ అనే చెప్పాలి. మలైకా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అప్పట్లో చయ్యా చయ్యా అంటూ ఓ రేంజ్ లో పాపులర్ అయిన ఈ బ్యూటీ మున్నీ బదనామ్ హుయి అంటూ అద‌ర‌గొట్టింది. ఇక తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సులు కూడా దోచుకుంది.

అప్ప‌డు గెస్ట్.. ఇప్పుడు ప్రియుడు

మ‌లైకా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర్‌తో ముచ్చెమ‌టలు ప‌ట్టిస్తూ వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. మలైకా అరోరా ఇంతకుముందు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం అయి ప‌లు కార‌ణాల వ‌ల‌న అత‌డికి దూర‌మైంది.

అర్భాజ్ నుండి విడిపోయిన త‌ర్వాత మ‌లైకా.. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్ చేస్తూ అనేక ప్రాంతాలకు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారే త‌ప్ప మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌నేది మాత్రం ఒప్పుకోవ‌డం లేదు.

Arjun Kapoor - Malaika Arora

ఆ విషయాన్ని పక్కన పెడితే అర్జున్ కపూర్ కి చెందిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటో మలైకా అరోరా మరియు అర్భాజ్ ఖాన్ ల పెళ్లిలో దిగిన ఫోటో.

-Advertisement-

అప్ప‌టి వారి పెళ్లి సమ‌యానికి అర్జున్ క‌పూర్‌కి 13 ఏళ్లు అని తెలుస్తుండ‌గా, వారి పెళ్లిలో కూల్ డ్రింక్ తాగుతుండ‌గా, ఆ ఫొటో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో నెటిజ‌న్స్ ఈ పిక్ చూసి చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె పెళ్లికి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసిన అర్జున్ కపూర్ ఇప్పుడు ఆమెతో డేటింగ్ లో ఉండటం విచిత్రంగా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

pragya jaiswal : బాబోయ్ ప్ర‌గ్యా జైస్వాల్ అందాల‌తో ఇంతగా సెగ‌లు రేపితే త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే..!

Bigg Boss Telugu 6: డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు.. హౌజ్ నుండి ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రంటే..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News