anemia symptoms : రక్తహీనత అంటే శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేనప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలో ఐరన్ లోపించడం, ఇంకా అనేక కారణాల వల్ల చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కానీ అన్ని వ్యాధుల మాదిరిగానే మన శరీరంలో ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి, రక్తహీనత ఉన్నవారిలో కూడా చాలా లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రక్తహీనత ఉందని చెప్పడానికి ఎవరిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
రక్తహీనత లక్షణాలు
రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కొన్ని నిమిషాలు నడవడం లేదా తేలికపాటి శారీరక శ్రమ చేయడం కూడా శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో లేదో పరీక్షలు చేయించుకుని, దానికి అనుగుణంగా మందులు వాడాలి.
రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి చర్మం రంగు మారిపోతుంది. ఈ లెక్కన ఉంటే రక్తహీనతగా అనుమానించాలి. తగినంత రక్తం లేకపోతే, అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి గుండె చాలా కష్టపడాలి. ఈ ప్రక్రియలో కొందరు ఛాతీలో నొప్పిని అనుభవిస్తారు. కానీ గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి ఛాతీ నొప్పి కూడా వస్తుంది కాబట్టి.. వైద్యులను సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుగొనవచ్చు.
ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారు ఐస్ క్యూబ్స్, పెన్సిల్స్, పెయింట్, గోడకు రాసుకున్న సుద్ద వంటివి తినడానికి ఇష్టపడతారు. ఈ రకమైన వింత లక్షణాలు కనిపిస్తే మీరు రక్తహీనతగా అనుమానించాల్సిందే. శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కారణం కావచ్చు. ఎందుకంటే శరీరంలో తగినంత రక్తం ఉంటే అన్ని భాగాలకు వేడి సరిగ్గా అందుతుంది. దీంతో శరీరం వేడిగా మారుతుంది. ఇక రక్తం లేకపోతే శరీరం చల్లగా ఉంటుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారికి తరచుగా తలనొప్పి రావచ్చు. ఈ క్రమంలో రక్తహీనత సమస్యకు పరిష్కారం దొరికితే తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తలనొప్పులు వస్తున్న వారు రక్తహీనత ఉన్నట్లు అనుమానించి పరీక్షలు చేయించుకుని నిజాన్ని నిర్ధారించుకుని మందులు వాడితే సమస్య నుంచి బయటపడవచ్చు.