dry seeds laddu
డ్రై సీడ్స్ లడ్డు తయారీ కి కావలసినవి:
తెల్ల నువ్వులు: అరకప్పు,
అవిసె గింజలు: అరకప్పు,
గుమ్మడి గింజలు: అరకప్పు,
సబ్జా గింజలు : అరకప్పు,
కిస్మిస్ : పావుకప్పు,
యాలకులు: రెండు లేదా మూడు.
డ్రై సీడ్స్ లడ్డు తయారుచేసే విధానం: ముందుగా అన్ని రకాల గింజలను నూనె లేకుండా విడిగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకుని చివరగా కిస్మిస్ , యాలకులు వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.
-Advertisement-