Homeviral newsViral Video: నిద్ర‌లేపింద‌నే కోపం.. తోటి పులిపై ఎలా దాడి చేస్తుందో చూడండి..!

Viral Video: నిద్ర‌లేపింద‌నే కోపం.. తోటి పులిపై ఎలా దాడి చేస్తుందో చూడండి..!

Telugu Flash News

Viral Video: నిద్ర అనేది మ‌నుషుల‌తో పాటు జంతువుల‌కి త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రం .స‌రైన నిద్ర పోలేదు అంటే ఇక ఆ రోజు మైండ్ అంతా చాలా దారుణంగా ఉంటుంది. సాధారణంగా ఒక రోజులో మనిషికి ఏడు గంటల ప్రశాంతమైన నిద్ర కావాలి.

అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న చాలా మంది తాము నిద్రకు దూరమవుతున్నామని అంటున్నారు. కాస్తంత విరామ సమయం దొరికినప్పుడు కానీ.. ఒక సమయం అంటూ లేకుండా కొంద‌రు నిద్ర పోతుంటారు. అయితే ఇలా నిద్రపోవటం శరీరానికి అంత ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక జంతువుల‌లో పులుల విష‌యానికి వ‌స్తే అవి రాత్రి పూట నిద్ర పోవు. ఆ స‌మ‌యంలో వేట‌కు బ‌య‌లుదేరుతుంటాయి.

పిల్ల‌పై కోపం..

పులులు పగలు మాత్రం హాయిగా పడుకుంటాయి. అవి రోజుకు 18-20 గంటలు పడుకుంటాయని అంచనా. పులుల‌లో ఆడ పులులు పిల్లలతో కలిసి వేట సాగిస్తాయి.

ఎందుకంటే పిల్లలకు వేట నేర్పడం, తద్వారా తమ ఆహారాన్ని తామే ఎలా సాధించుకోవాలనేది ఆడ‌పులులు చిన్న‌ప్ప‌టి నుండి నేర్పిస్తాయి. ఇక స‌మయం ఉన్న‌ప్పుడు నిద్ర‌పోతుంటాయి.

అయితే ఈ వ్య‌వ‌హారం తెలియ‌ని పులి త‌ల్లి పులిని డిస్ట్ర‌బ్ చేసింది. దాంతో చిరాకు వ‌చ్చి కోపంతో పిల్ల పులిపై పంజాతో తిరగబడింది.

-Advertisement-

పాపం పిల్ల పులి మాత్ర త‌ల్లి ఆక్రోశానికి భ‌య‌ప‌డి వెన‌క‌డుగు వేసింది. ఇదంతా ఓ జూలో జ‌రిగిన‌ట్టుగా తెలుస్తుంది. ఇక రెండు పులుల దెబ్బలాటను గ్లాస్‌లోంచి చూస్తున్న ఓ చిన్నారి ఒక్కసారిగా భయపడిపోవ‌డం వీడియోలో మ‌నం స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇది జూన్‌లో జ‌రిగ‌న‌ట్టు తెలుస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అంతేకాక ఇప్పటి వరకూ 15 లక్షలకు పైగా లైక్స్‌ని సంపాదించింది. ఇక‌ భారీగా కామెంట్లు కూడా వస్తున్నాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News