Homeviral newsviral video : షూటింగ్‌ చూడ్డానికి వచ్చిన చిరుత.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

viral video : షూటింగ్‌ చూడ్డానికి వచ్చిన చిరుత.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

Telugu Flash News

viral video : సినిమా షూటింగ్‌ల సమయంలో ఇతర సినిమా హీరోలు రావడం, అక్కడ జరిగే హంగామా మనం చూస్తుంటాం.. పెద్ద హీరోలు తమ షూటింగ్‌లకు వచ్చినప్పుడు ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు.

ఇక సీరియల్స్ విషయానికి వస్తే.. వాటి గురించి తెలిసిందే అవి ఎన్నేళ్ళు సాగుతాయో ఎవ్వరికీ తెలియదు. ఇటీవలే ఓ సీరియల్ షూటింగ్ కి అనుకోని అతిథి వచ్చింది . అతిథి వస్తే అందరూ ఆహ్వానిస్తారు.. కానీ ఇక్కడ అందరూ పారిపోతున్నారు.. పరుగెత్తుతున్నారు.

వర్షాకాలం కావడంతో.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. అలాగే జనసంచారం అస్తవ్యస్తంగా మారింది. దాంతో ఇళ్లలోకి, షూటింగ్ స్పాట్‌లలోకి పాములు, ఇంకా ఇతర జంతువులు వస్తున్నాయి.

అయితే ఇక్కడ ఓ చిరుత సీరియల్ షూటింగ్ కోసం వచ్చింది. చిరుతను చూడగానే వారు పరుగులు తీశారు. అజుని సీరియల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌కి చిరుత రావడంతో అందరూ షాక్ అయ్యారు.

నిజానికి, గత 10 రోజుల్లో సెట్‌లోకి చిరుతలు ప్రవేశించడం ఇది నాల్గవ సారి అని అక్కడ ఉన్నవారు తెలిపారు. ఈ అడవి జంతువులు పదే పదే కనిపించడం సిబ్బందిని మరియు “అజుని” సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి మరియు ఆందోళనకు గురి చేసింది.

-Advertisement-

also read :

Prabhas : ఇండియాకు వచ్చిన ప్రభాస్.. 3 సినిమాలు సెట్స్‌పైనే.. ప్లాన్ ఏంటి ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News