Health Tips in Telugu
- గొంతు గరగరలాడుతుంటే అల్లం, తులసి ఆకులు మరిగించి కొంచెం తేనె కలిపి త్రాగండి.
- విరేచనాలు ఆగిపోవడానికి నిమ్మరసం, ఉసిరిక రసం రెండూ కలిపి త్రాగండి. జిగట విరేచనాలు, కడుపునొప్పి మటుమాయం కావాలంటే ఒక స్పూను ఉసిరికాయ రసాన్ని గసగసాలపాలు, పంచదారతో కలిపి రోజూ రెండుపూటలా తీసుకోండి.
- కళ్ళలో ఇసుకరేణువు గానీ, నలక గానీ పడితే నాలుగైదు చుక్కల పాలను కంట్లో వేసుకుని తలను పక్కకు వాల్చి పడుకుంటే నలకలు బయటకు వస్తాయి.
- రోజూ చిన్న అల్లం ముక్క లవంగం ఒకటి రెండు చప్పరిస్తుంటే గ్యాస్ మూలంగా వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.
- ముక్కు నుంచి రక్తం కారుతుంటే నాలుగు దానిమ్మరసం చుక్కల్ని ముక్కులో వేస్తే రక్తం పడడం ఆగుతుంది.
- ఆలివ్ లేదా కలబంద రసం రాస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
- నొప్పిగా ఉన్నచోట కలబందరసం రాస్తే 10 నిముషాలలో బాధ ఉపశమనం.
- కడుపులో మంటగా ఉంటే భోజనం తర్వాత గ్లాసుడు నీటిలో కాసింత బెల్లం కలుపుకొని తాగితే మంట తగ్గుతుంది.
- ఆయాసంతో బాధపడేవారికి మిరియాల పొడిలో వెన్న కలిపి తినిపిస్తే ఆయాసం తగ్గుతుంది.
- బ్యాక్ పెయిన్ తో బాధపడేవారు లావెండర్, జింజర్, యూకలిప్టస్ ఆయిల్స్‌ను నమపాళ్ళలో కలిపి మసాజ్ చేసుకోవాలి.
- ఒక గ్లాసు నీటిలో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని పరగడుపున తాగితే ఎండకు బయటకు వెళ్ళినా కూడా వడదెబ్బ ప్రభావం అంతగా పడదు.
- తలనొప్పి తగ్గాలంటే నిమ్మకాయ సగానికి కోసి నుదుటిపై రుద్దాలి.
- ప్రతిరోజూ గోరువెచ్చని ఆయిల్‌తో శరీరానికి మసాజ్ చేసుకుంటే మెనోపాజ్ దశలో కలిగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చు.
- ముల్లంగిని ఆహారంలో చేర్చడంవల్ల రక్తశుద్ధి జరుగు తుంది. మూత్రకోశ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
- రోజుకు మూడు, నాలుగు కరివేపాకులను నమిలితే నోరు శుభ్రపడుతుంది. చిగుళ్ళ, పళ్ళ సమస్యలకు కూడా దూరమే! నోటి అరుచి పోతుంది కూడా !
- నిమ్మనూనెలో రెండు చుక్కల వేపనూనె వేసి రాత్రిపూట దీపం వెలిగిస్తే గదంతా సువాసన పరచుకోవడంతో పాటు దోమలు దగ్గరకు రావు. దోమలు లేకుంటే జబ్బులూ దూరమే !
- ప్రకృతి ప్రసాదించిన పదార్థాలను వీలైనంత సహజ రూపంలో తీసుకుంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది.
- నీటిని, ఇతర ద్రవ పదార్థాలను రోజుకు 4 లీటర్ల వరకూ తీసుకోవాలి.
- రోజూ నిమ్మరసం, సొరకాయ రసం కలిపి తీసుకుంటే గుండె పటిష్టమవుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక టేబుల్ స్పూను నిమ్మరసం కలుపుకోవాలి.
- వారానికి ఒకేసారి దాల్చినచెక్క లేదా లవంగ నూనెలో దూదితో పలువరుసను రుద్దినట్లయితే పిప్పి పళ్ళు రావు. పిప్పిపన్ను వచ్చి నొప్పి చేసినప్పుడు ఈ నూనెలలో దూదిని ముంచి నొప్పి ఉన్నచోట పెడితే ఉపశమనం కలుగు తుంది.
- ప్రతిరోజూ మొలకెత్తిన పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలు తీసుకుంటే గుండె కండరాలు శక్తివంతమవుతాయి.
- ఎండాకాలంలో ఎంత నీరు తాగినా దాహం తీరినట్ల నిపించదు. అలాంటప్పుడు ఉదయం కాని, మధ్యాహ్నం కాని ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ యాలకుల పొడి కలిపి తాగితే ఉపశమనమే! రుచి కోసం చక్కెర కలుపుకోవచ్చు.
- కొందరికి ప్రయాణంలో అతి దాహం బాధ పెడుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏలక్కాయను నోట్లో వేసుకుంటే దాహం అనిపించదు.
- దోమలు, తేనెటీగలు కుట్టినప్పుడు గాయం మీద యాస్పిరిన్ మాత్రను నీటిలో తడిపి ముద్ద చేసి పెడితే నొప్పి తగ్గుతుంది.
also read :
Health Tips in Telugu : ఆరోగ్య చిట్కాలు (18-07-2023)
Health Tips (14-03-2023) : ఈ 10 ఆరోగ్య చిట్కాలు.. మీ కోసం..
-Advertisement-