HomesportsUsain bolt: క్రికెట్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న ఉస్సేన్ బోల్ట్.. త‌న కోరిక ఇలా నెర‌వేర‌బోతుందా?

Usain bolt: క్రికెట్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న ఉస్సేన్ బోల్ట్.. త‌న కోరిక ఇలా నెర‌వేర‌బోతుందా?

Telugu Flash News

Usain bolt: ఉస్సేన్ బోల్ట్.. ఈ పేరుకి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. చిరుత పులిని మించిన వేగంతో ప‌రుగెత్త‌గ‌ల బోల్ట్ ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచి అంద‌రిచే శ‌భాష్ అనిపించుకున్నాడు. ఈ జమైక పరుగుల వీరుడిని అందరూ ‘Lightning Bolt’ అని పిలుస్తుంటారు.

పరుగు పందెంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ జ‌మైక‌న్ వీరుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుండి క్రికెట‌ర్ కావాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న‌గా, ప‌లు కార‌ణాల వ‌ల‌న అది నెర‌వేర్చుకోలేక‌పోయాడు. అయితే ఇప్పుడు అత‌ని కోరికి నిజం అయ్యేలా క‌నిపిస్తుంది.

ఇక క్రికెట‌ర్‌గా..

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఉసేన్ బోల్ట్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించాడు. కొన్ని రోజుల క్రితం ప‌రుగు పందెంకి స్వ‌స్థి చెప్పిన బోల్ట్ క్రికెట‌ర్‌గా మారేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.

ఇండియా మొట్టమొదటి లైవ్ డిజిటిల్ స్పోర్ట్స్ ఛానెల్ ‘పవర్ స్పోర్ట్స్’ ఆధ్వర్యంలో గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్ పేరుతో ఓ టీ20 లీగ్ మొద‌లు కాబోతుంది. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకూ ఈ టోర్నీ జరుగునుండ‌గా, ఇందులో ప్రపంచ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనబోతున్నాయి .

తొలి ఎడిష‌న్ ఇండియాలో జ‌ర‌గ‌నుండ‌గా, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూఎస్‌ఏ, కెనడా, సౌతాఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్‌ని నిర్వహించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక 8 టీమ్స్‌కి పేర్లు కూడా పెట్టేయ‌గా, ఆ జ‌ట్లు ఇండియన్ సప్పైర్స్, ఆస్ట్రేలియాన్ గోల్డ్స్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరీస్, సౌతాఫ్రికా ఎమెరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్గా ఉన్నాయి.

ఇందులో ఉసేన్ బోల్ట్‌తో పాటు మునాఫ్ పటేల్, యూసఫ్ పఠాన్, గుల్భాద్దిన్ నైబ్, ఏంజెలో మాథ్యూస్,ఇయాన్ బెల్ వంటి మాజీ క్రికెటర్లు కూడా పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి ర‌న్నింగ్ రేస్‌లో అద‌ర‌గొట్టిన బోల్ట్.. క్రికెట్‌లో ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

-Advertisement-

మరిన్ని వార్తలు చదవండి :

rashmika mandanna : ర‌ష్మిక హిందీ మాట్లాడ‌డం ఎప్పుడైన చూశారా.. ఎంత ముద్దుగా మాట్లాడిందో తెలుసా?

ginger health benefits : అల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News