Pawan Kalyan : ‘సినిమా అంటే వినోదం, ఆనందం, సినిమాల్లో ఎవరినైనా అభిమానించండి. ఏ హీరోనైనా అభిమానించండి. కానీ ఆ విషయాల్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దు. సినిమా వేరు.. రాజకీయం వేరు. రాజకీయాల విషయానికి వస్తే నా మాట వినండి. కలిసి ఆలోచిద్దాం. ఈ సమాజానికి పోరాడే వాళ్లు కావాలి. నేను ఒక్కడినే సరిపోను. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే నాయకులు కావాలి’ అని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో అన్నారు.
ఇంకా , ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ అభిమానులు, ఒక హీరో గొప్ప అంటే, మరో హీరో గొప్ప అని తరచూ గొడవపడుతుంటారు.., కాని నేను చిరంజీవి బాలకృష్ణ, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్.. వీళ్లంటే నాకు ఇష్టం.. అందరినీ గౌరవిస్తాను, వారి సినిమాలు చూస్తాను.. ఎప్పుడో ఒకప్పుడు అందరం కలుస్తాం.. సరదాగా మాట్లాడుకుంటాం.
ప్రభాస్, మహేష్ నాకంటే పెద్ద హీరోలు.. నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. తారక్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేటి హీరోలు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రపంచం మొత్తంలో నేనెవరో తెలియదు. నేను పాన్ ఇండియా హీరో కాను. ఆ విషయంలో నాకు అహం లేదు.
సగటు మనిషి బాగుంటే చాలు.. ఇలా సినిమాల పరంగా ఎవరినైనా అభిమానించండి. రాజకీయాలలో మీ ప్రేమను చూపించవద్దు. ఇక్కడ రైతుకు కులం లేదు. కులం పేరుతో మనలో మనం గొడవలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
read more news :
pawan kalyan : హరిహర వీరమల్లు.. ఇక నైనా సాగేనా?
Pawan Kalyan: క్రిష్‌తో ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్.. ఎందుకిలా చేస్తున్నాడు..!