Adipurush 4th Day Collections : భారీ బడ్జెట్తో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కి మిశ్రమ స్పందన లభించింది. కానీ మొదటి వారాంతంలో భారీ కలెక్షన్లను వసూలు చేసింది. మొదటి మూడు రోజులకు రూ.340 కోట్లు అందుకుంది చిత్ర యూనిట్. తాజాగా నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కానీ సోమవారం నుంచి ఆదిపురుష్ సినిమా కష్టాలు మొదలయ్యాయి. కలెక్షన్లు 75% పడిపోయాయి. బాక్స్ ఆఫీస్ ఇండియా లెక్కల ప్రకారం, సోమవారం ఈ చిత్రం ఆల్ ఇండియా కలెక్షన్ దాదాపు రూ. 20 కోట్లు మాత్రమే. సోమవారం బాలీవుడ్లో రూ.8 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంఅక్కడ మొదటి నాలుగు రోజులకు రూ. 113 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల్లో రూ.72 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ ప్రకారం రూ. 113 కోట్లు ఉంటుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.70 కోట్ల షేర్ వసూలు చేయాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది జరగడం కష్టంగా అనిపిస్తోంది. మరో పదిరోజులు సినిమా కలెక్షన్స్ ఉంటేనే ఇది సాధ్యం. లేకుంటే ప్రభాస్ కు వరుసగా మరో డిజాస్టర్ రావడంలో సందేహం లేదు.
తొలి వారాంతంలో ఆదిపురుష్ కలెక్షన్లు పఠాన్ సినిమాను క్రాస్ చేశాయి. అప్పటి వరకు రూ. పఠాన్ పేరుతో. 313 కోట్ల రికార్డును ఆదిపురుష్ అధిగమించింది. కానీ పఠాన్ ఫైనల్ కలెక్షన్స్ 1000 కోట్ల మార్క్ కాగా , ఆదిపురుష్ గ్లోబల్గా పఠాన్ ను దాటదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆదిపురుష్ మొదటి నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చాలా వరకు నష్టపోయామని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు.
THE NEGATIVE WORD OF MOUTH HAS COME INTO PLAY…
After a strong opening weekend, #Adipurush COLLAPSES on Monday.#Hindi version. #India biz. pic.twitter.com/HJT4hHT80u— taran adarsh (@taran_adarsh) June 19, 2023
అంతే కాకుండా సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ బాగా లేదని, క్యారెక్టర్ డిజైన్ కూడా బాగాలేదని టాక్ వచ్చింది. ఆఖరికి ఈ సినిమా జాతీయ వివాదానికి కూడా దారి తీసింది. అందువల్ల ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
READ MORE :
Ban Adipurush Movie : ఆదిపురుష్ సినిమాను నిషేధించాలి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ
Ram Charan Upasana: తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన.. మెగా ప్రిన్సెస్ వచ్చేసింది