HomesportsRobin Uthappa:ఆత్మహ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నానంటూ రాబిన్ ఊతప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Robin Uthappa:ఆత్మహ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నానంటూ రాబిన్ ఊతప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Telugu Flash News

Robin Uthappa: టీమిండియా క్రికెట్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక పేజీని లిఖించుకున్న క్రికెట‌ర్ రాబిన్ ఊత‌ప్ప‌. టెస్ట్, వ‌న్డే, టీ 20 ఇలా అన్ని మ్యాచ్‌ల‌లోను అద్భుతంగా ఆడి క్రికెట్ ప్రేమికుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. రీసెంట్‌గా టీమిండియా క్రికెటర్‌ రాబిన్ ఉతప్ప రిటైరయ్యాడు.

సోషల్ మీడియా వేదికగా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. ఉతప్ప టీమిండియా తరఫున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎలాంటి బౌలర్లనైనా లెక్కచేయకుండా సులభంగా సిక్స్‌లు బాదడం ఈ కర్ణాటక క్రికెటర్‌ స్పెషాలిటీ. అయితే స‌డెన్‌గా ఈ క్రికెట‌ర్ రిటైర్మెంట్ తీసుకోవ‌డం కొంద‌రికి షాకింగ్‌గా అనిపించింది.

ఎందుకలా?

రిటైర్మెంట్ త‌ర్వాత ఊత‌ప్ప త‌న జీవితంలో ఎదురైన కొన్ని గ‌డ్డు ప‌రిస్థితుల గురించి తెలియ‌జేశాడు. గతంలో తాను క్లినికల్ డిప్రెషన్‌కు గురయ్యానని అలా డిప్రెషన్ ఎదుర్కొన్నానో కూడా తెలియదంటూ పేర్కొన్నాడు.

2009ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చాడు. 2009లో జరిగిన రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు న‌న్ను కొనుక్కుంది.

ఆర్సీబీతో ఆడినప్పుడు నేను పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నాను. ఆ సీజన్‌లో నేను ఒక్క గేమ్‌ కూడా సరిగ్గా ఆడలేక‌పోయాను. ఆ స‌మ‌యంలో నన్ను ఇక డ్రాప్ చేయాలనుకున్న టైంలో ఒక్క మ్యాచ్ మంచిగా ఆడాను, తద్వారా మళ్లీ జట్టులో ఉన్నాను.

అయితే అంతకుముందు కూడా కొన్ని ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. ముంబై జట్టు నుంచి ట్రాన్స్ ఫర్ పత్రాలపై సంతకం చేయకపోతే..నేను ముంబై ప్లేయింగ్ XIలో ఆడలేనని ఎంఐకి చెందిన ఒకరు నాతో చెప్పారు అని ఉతప్ప కొంత క్లారిటీ ఇచ్చాడు.

-Advertisement-

మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఊతప్ప.. 2006లో ఇంగ్లాడ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు.. అనేక మ్యాచ్‌ల్లో తాను ప్రాతినిథ్యం వహించిన జట్లను గెలిపించాడు.

మరిన్ని వార్తలు చదవండి 

Roger federer retirement : రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్‌ దిగ్గజం రోజర్ ఫెదరర్..

Taapsee Pannu: జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కి కోపంతో ఊగిపోయిన తాప్సీ.. అంత కోప‌మెందుకు అమ్మ‌డు అంటున్న నెటిజ‌న్స్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News