Homenationalఅజిత్ దోవల్ పై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు

అజిత్ దోవల్ పై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు

Telugu Flash News

జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (AJIT DOVAL) పై అమెరికా రాయబారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌కు దోవల్ నిధి లాంటివారని , ఆయన భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి నిధి అని అన్నారు. చిన్న మారుమూల ప్రాంతం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ మేరకు మన దేశంలో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో ఇరు దేశాల భద్రతా సలహాదారుల సమావేశం కోసం అమెరికాకు చెందిన ఎన్‌ఎస్‌ఏ జేక్ సల్లీవాన్ భారత్‌కు వచ్చారు . అజిత్ దోవల్, సల్లీవాన్ మధ్య జరిగిన భేటీలో ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ.. అమెరికన్లు భారతీయులను, భారతీయులు అమెరికన్లను ప్రేమిస్తారని అన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఏర్పడిందని అంటున్నారు.

డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ ముందుకెళ్తోందని, మారుమూల ప్రాంతాల్లోని టీ స్టాల్స్‌లో కూడా ఆన్‌లైన్ చెల్లింపులు అందుబాటులో ఉంటాయని గార్సెట్టీ వివరించారు. టీ స్టాల్ నిర్వహిస్తున్న వ్యక్తికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా అందుతున్నాయన్నారు. కాగా, ఈ సమావేశంలో భాగంగా అజిత్ దోవల్, జేక్ సల్లీవాన్ మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.

read more :

pawan kalyan : ‘హరిహర వీరమల్లు’.. ఇక నైనా సాగేనా?

horoscope today 14 June 2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News