సెర్బియా టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ (novak djokovic) ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ 6-3, 5-7, 6-1, 6-1 తేడాతో విజయం సాధించాడు. జకోవిచ్ ఫైనల్లో కాస్పర్ రూడ్ తో తలపడతాడు.
తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన జకోవిచ్‌కు రెండో సెట్లో అల్కరాజ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. స్పానిష్ ఆటగాడు అల్కరాజ్ పదునైన సర్వీస్‌లు, బలమైన గ్రౌండ్ షాట్లతో విరుచుకుపడి 7-5తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే జకోవిచ్ మాయాజాలం అక్కడే మొదలైంది. అల్కరాజ్ను ప్రేక్షకపాత్రకే పరిమితం చేసి, అతని సర్వీస్‌ను అనేకసార్లు బ్రేక్ చేస్తూ, జకోవిచ్ వీరోచితంగా నిలిచాడు. తన అనుభవాన్ని, ప్రతిభను మేళవించి వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ విజేతగా నిలిచాడు.
జకోవిచ్ గతంలో 2016 మరియు 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇప్పుడు అతను మూడో టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో అలెగ్జాండర్ జ్వెరెవ్ కాస్పర్ రూడ్ చేతిలో ఓడిపోయాడు. జకోవిచ్ ఫైనల్లో కాస్పర్ రూడ్ తో తలపడతాడు.
మరోవైపు, జకోవిచ్ తన కెరీర్లో 34వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 22 టైటిల్స్‌తో, అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్‌తో సమంగా ఉన్నాడు ఈసారి ఫైనల్ గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ అందుకుంటే… ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (23 టైటిళ్లు) సాధించిన ఆటగాడిగా జకోవిచ్ చరిత్రలో నిలిచిపోతాడు.
read more :
Om Raut : హీరోయిన్ కి ముద్దు పెట్టిన దర్శకుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
aloe vera juice benefits : అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు