Homehealthpotlakaya benefits in telugu: పొట్లకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

potlakaya benefits in telugu: పొట్లకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Telugu Flash News

మ‌న‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల‌లో పొట్ల‌కాయ ఒక‌టి. ఇది చాలా రుచిక‌రంగాను, ఆరోగ్య‌కరంగాను ఉంటుంది. పొట్ల‌కాయ వ‌ల‌న ఎన్నో ప్రయోజ‌నాలు (potlakaya benefits in telugu) ఉన్నాయ‌ని వైద్యులు చెబుతుంటారు.

పొట్లకాయలోని పోషకాలు, అది చేసే మేలు ఎంతో వుంది.ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి. మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు కూడా పొట్ల‌కాయ చాలా బాగా ప‌ని చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా పొట్ల‌కాయ ప్ర‌ముఖ పాత్ర వ‌హిస్తుంది. అంతేకాక రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

పొట్లకాయ లాభాలెన్నో..! (potlakaya benefits in telugu)

రక్తపోటును అదుపులో ఉంచడంలో, మధుమేహం , మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని త‌గ్గించ‌డంలోను పొట్ల‌కాయ కీల‌క పాత్ర పోషిస్తుంది.

పొట్లకాయలో పిండిపదార్థాలు, ఖనిజాలు. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్ మరియు సులభంగా జీర్ణమయ్యే ఫైబర్, నీరు ఉంటాయి.

సాధార‌ణంగా కొంద‌రు పొట్ల‌కాయ‌ని తిన‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు. ఆ క్ర‌మంలో పెరుగుతో చేసుకుంటారు. ఇది రుచిక‌రంగా ఉంటుంది.

-Advertisement-

potlakaya benefits in teluguపొట్లకాయతో చేసిన డికాషన్ తీసుకోవడం ద్వారా జ్వరం ప్రభావాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. కొద్దిగా తేనె మరియు ఛిరెట్టా అని పిలవబడే మూలికను పొట్లకాయతో కలిపి తీసుకోవడం ద్వారా బిలియస్ మరియు మలేరియా జ్వరాల బారిన ప‌డ‌కుండా ఉంటాం.

పొట్ల‌కాయ వ‌ల‌న మంచే కాదు చెడు కూడా ఉంటుంది. అమితంగా దీనిని తీసుకునే వారికి కొన్ని దుష్ప్ర‌భ‌వాలు కూడా క‌లుగుతాయి. పొట్లకాయ రసం అధికంగా తీసుకోవడం జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.

పొట్లకాయ రసం చాలా చేదుగా ఉంటుంది, కాబట్టి చాలా మందికి దీనిని తాగడం ద్వారా కొందరిలో అలెర్జీ వస్తుంది. గ్యాస్ స‌మ‌స్య‌లు కూడా ఉత్ప‌న్నం అవుతాయి.

ఇవి కూడా చదవండి :

నిద్ర బాగా పట్టాలంటే..ఇలా చేయండి.

కలువ లాంటి కళ్ళ కోసం..ఈ చిట్కాలు పాటించండి .

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News