HomecinemaNTR : ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కి దూరమైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..అస‌లు కార‌ణం ఇదా?

NTR : ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కి దూరమైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..అస‌లు కార‌ణం ఇదా?

Telugu Flash News

NTR: ఊరు, రాష్ట్రాలే కాదు దేశ‌మంత‌టా కూడా ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మొద‌ట విజ‌యవాడ‌లో వేడుక‌లని భారీ ఎత్తున నిర్వ‌హించ‌గా, ఆ తర్వాత హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌కి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు భారీ ఎత్తున వ‌చ్చారు. రామ్ చ‌ర‌ణ్‌, వెంక‌టేష్‌, నాగ చైత‌న్య‌, సుమంత్ ఇలా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో సంద‌డి చేశారు.

నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు అయిన ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ వేడుక‌కి హాజ‌రు కాక‌పోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. వారిద్ద‌రి గురించి కొద్ది రోజులుగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఎందుకు వారిద్ద‌రు వేడుక‌కి హాజ‌రు కాలేదు, వారికి ఆహ్వానం అంద‌లేదా ఇలా ఎన్నో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తన పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో తాను రాలేనని జూనియర్ ఎన్టీఆర్ చివరి క్షణాల్లో ప్రకటించడంతో ఎన్టీఆర్ పై నందమూరి కుటుంబ సభ్యులు, మరియు ఆయన ఫ్యాన్స్ ఒకింత మండిప‌డ్డారు.

టిడి జనార్ధన్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము జూ. ఎన్టీఆర్ ని ఆహ్వానించాం అని అయినా రాలేదు అని జనార్ధన్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్ ని ఇన్వైట్ చేయాలని ఎంత‌గానో ప్రయత్నించాం. అయితే ఆయ‌న మాకు వారం తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్ప‌టిక కూడా వెళ్లి ఆహ్వానించాం.

త‌న‌కేమో ప్రోగ్రాం ఫిక్స్ అయింది అని, తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ ట్రిప్ వెళుతున్నాం అని తెలియ‌జేశారు. పుట్టినరోజులు ప్రతి ఏడాది వస్తాయి.. కానీ శతజయంతి ఒక్కసారే వస్తుందని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన ఆయ‌న రాలేదు. చివరకు జూ. ఎన్టీఆర్ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. కళ్యాణ్ రామ్ కి కూడా ట్రిప్ ఫిక్స్ అయిందేమో అని టిడి జనార్ధన్ కాస్త వెట‌కారంగా కామెంట్స్ చేశారు.

అయితే ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ శత జయంతి వేడుకలకు వెళ్లకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని సమాచారం అందుతుంది. నందమూరి కుటుంబంలోని ఓ ముఖ్యమైన వ్యక్తికి… వీరిద్దరూ సదరు కార్యక్రమానికి రావడం అస్సలు ఇష్టం లేదట. అందుకోస‌మ‌నే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్… చివరి క్షణాల్లో తాము శతజయంతి వేడుకలకు వెళ్లడం లేదని ప్రకటించేసారు.

తన వల్ల ఇంకొకరికి నష్టం జరగకూడదని… తనకు శత్రువులు పెరిగినా సరే… నందమూరి కుటుంబం బాగా ఉండాలని నిత్యం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. ఎవరేమనుకున్నా సరే… ఆ కుటుంబం కోసం జూనియర్ ఎన్టీఆర్ నిత్యం జపిస్తూనే ఉంటారని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఎన్టీఆర్ రీసెంట్‌గా త‌న వ‌ర్క్‌కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో క‌లిసి విదేశాల‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే.

-Advertisement-

read more news :

NTR:వెకేష‌న్‌కి వెళ్లిన‌ ఎన్టీఆర్.. పిల్ల‌లు భ‌లే ముద్దొస్తున్నారుగా..!

NTR:త‌న తాత‌కి అస‌హ‌నంతో నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. కార‌ణం ఏంటో తెలుసా?

IPL 2023: బాబోయ్‌…ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఆ హీరోయిన్ ప‌ది ల‌క్ష‌లు ఖర్చు పెట్టిందా..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News