HomebusinessGold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (29-05-2023)

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (29-05-2023)

Telugu Flash News

Gold Rates Today: ఇవాళ బంగారం ధరల్లో మార్పులు కనిపించలేదు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతోందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో పసిడి ధర పతనం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో బంగారం స్థిరంగా ఉంది.

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,944.30 డాలర్ల వద్ద ఉంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరల్లో మార్పులు సంభవించలేదు. మరోవైపు వెండి ధరల్లోనూ మార్పులు లేవు.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,550 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.60,600 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.55,550గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.60,600 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.55,940 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,040గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధరలోనూ మార్పులు జరగలేదు. ఇవాళ 10 గ్రాములు రూ. 27,150 వద్ద కొనసాగుతోంది.

Read Also : today horoscope in telugu : 29-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News