salman khan bodyguards ignored katrina kaif husband, actor vicky kaushal : బాలీవుడ్ స్టార్ భామ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తన అందచందాలతో టాలీవుడ్, బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. సల్మాన్ ఖాన్‌తో ప్రేమాయణం సాగించి అప్పట్లో తెగ వార్తలలో నిలిచింది. అయితే ఇటీవల బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ని ప్రేమ వివాహం చేసుకుంది కత్రినా. రీసెంట్గా విక్కీ కౌశల్‌ని సల్మాన్ ఖాన్ అవమానించాడంటూ ప్రచారం నడుస్తుంది.
వివరాలలోకి వెళితే దుబాయ్ లో జరుగుతున్న IIFA 2023 అవార్డ్స్ అట్టహాసంగా జరగగా, ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం వేడకలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమంలో విక్కీ కౌశల్ ఒక అభిమానికి సెల్ఫీ ఇస్తున్న టైంలో సల్మాన్ ఖాన్ అటుగా నడుచుకుంటూ వెళ్లాడు.
అయితే దారి మధ్యలో ఉన్న కౌశల్ ని సల్మాన్ బాడీ గార్డ్స్ ఓ హీరో అని కూడా చూడకుండా పక్కకి నెట్టేశారు. అయితే ఈ విషయంలో విక్కీ కౌశల్.. ఏ మాత్రం సీరియస్ అవ్వకుండా సల్మాన్ తో హ్యాండ్ ఇవ్వడానికి, మాట్లాడడానికి ట్రై చేయగా, సల్మాన్ సరిగ్గా మాట్లాడకుండా అలా చూసుకుంటూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.ఇక ఆ వీడియో చూసిన నెటిజెన్స్ సల్మాన్ అండ్ అతడి బాడీ గార్డ్స్ పై నిప్పులు చెరుగుతున్నారు. హీరో అని కూడా చూడకుండా ఏ మాత్రం మర్యాద ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సల్మాన్ కి ఇటీవల గ్యాంగ్ స్టార్ నుంచి బెదిరింపు ఇమెయిల్స్ రావడంతో.. తన సెక్యూరిటీని ఇంకొంచెం పెంచుకున్నారు.
What an insult of #VickyKaushal 😄🙈👀. #SalmanKhan & his bodyguards totally ignored & Kicked him out at the #IIFA2023 Redcarpet. 😝 pic.twitter.com/au07LjbXoc
— Umair Sandhu (@UmairSandu) May 26, 2023
ఇక బాలీవుడ్ హాట్ కపుల్‌గా పేరుగాంచిన కత్రీనా కైఫ్-విక్కీ కౌషల్ జంట ప్రతి ఒక్కరిని ఎంతో ఆకర్షిస్తూ ఉంటారు. ఎన్నో వేదికలపై కత్రీనా అందం గురించి విక్కీ ఎన్నో ప్రశంసలు కురిపించాడు. ఆమె అందానికి ముగ్ధుడై పెళ్లి కూడా చేసుకున్నాడు. వీరు వైవాహిక బంధంలో అడుగుపెట్టి రెండు సంవత్సరాలు కూడా కాలేదు.. అప్పుడే ఈ జంట సెపరేట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు నడిచాయి.. కత్రీనా-విక్కీ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. విడాకుల ప్రశ్నపై రీసెంట్గా ఆయనకు ప్రశ్న ఎదురు కాగా, నేను ఇంకా చిన్నపిల్లాడినే. ముందు నన్ను కాస్త ఎదగనివ్వండి అని అన్నాడు.. ఇంత ప్రమాదరమైన ప్రశ్నకు నేను ఎలా సమాధానం చెప్పగలను అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూసాయి.
read more news :
North Korea: కిమ్ రాజ్యంలో మరో అరాచకం.. రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు!
Daam: బీ కేర్ ఫుల్.. డామ్ మాల్వేర్తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక