Whatsapp: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వాట్సప్ యూజర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వాట్సాప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది.
ఇప్పటివరకు ఎవరికైనా మెసేజ్ చేస్తే అవతలివ్యక్తులకు మన ఫోన్ నంబర్ కనిపించేది. దీనివల్ల ఒక్కోసారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేది. ఈ నేపథ్యంలో అవతలి వ్యక్తులకు ఇకపై మన ఫోన్ నంబర్ తెలిసే వీలు లేకుండా వాట్సాప్ యూజర్‌నేమ్ అని పిలిచే సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
ఈ అప్‌కమింగ్ ఫీచర్ గురించి వాట్సాప్ బీటా ఇన్ఫో అనేక విషయాలను వెల్లడించింది. మనం ఎవరికైనా మెసేజ్ పంపితే అవతలి వ్యక్తికి మన ఫోన్ నంబర్ బదులుగా యూజర్ నేమ్ కనిపించేలా ఉంటుంది.
దీనికోసం యూనిక్ యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందని వాట్సప్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.23.11.15 వెర్షన్‌లో కనిపించిందని పేర్కొంది. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
యూనిక్ యూజర్‌నేమ్ సెట్ చేసుకుంటే బంధుమిత్రులు, తెలిసిన వాళ్లతో కాంటాక్ట్ కావచ్చు. అలాగే ఏవైనా గ్రూపుల ద్వారా కాంటాక్ట్ అయ్యే వ్యక్తులకు కూడా మన ఫోన్ నంబర్ అనేది కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు.
Read Also : Whatsapp: వాట్సప్‌లో నయా ఆప్షన్.. 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకోవచ్చు..