HomesportsWTC Final 2023: ఆస్ట్రేలియాతో పోరుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్‌ 11లో చోటు దక్కేదెవరికి?

WTC Final 2023: ఆస్ట్రేలియాతో పోరుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్‌ 11లో చోటు దక్కేదెవరికి?

Telugu Flash News

WTC Final 2023: ఐపీఎల్‌ తుది ఘట్టానికి చేరుకుంది. ఈ సందడి ముగింపు దశకు వచ్చేసింది. సుదీర్ఘంగా రెండు నెలల పాటు సాగిన మినీ పోరులో పది జట్లు ఒక్కో టీమ్‌ 14 మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. పాయింట్స్‌ టేబుల్‌లో సీజన్‌ మొత్తం ఆధిపత్యం చెలాయించిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు.. అనూహ్యంగా ఫైనల్‌ రేసులో వెనుకబడింది. ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లలో గుజరాత్‌ టైటాన్స్‌ టాప్‌లో నిలిచింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో స్థానంలో నిలవగా తొలి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ ఈ రెండు జట్లమధ్య జరిగింది. ఇందులో అనూహ్యంగా సీఎస్కే చేతిలో 15 పరుగుల తేడాతో జీటీ ఓటమిపాలైంది.

14 సీజన్లు ఆడితే 10వ సారి ఫైనల్‌కు చేరింది ధోని సారధ్యంలోని సీఎస్కే. ఫైనల్‌కు చేరే జట్టుతో సీఎస్కే తలపడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ముగిసిన వెంటనే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఇంగ్లండ్‌కు ఆటగాళ్లు బయల్దేరనున్నారు. టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నాడు. మిగతా ప్లేయర్లంతా ఐపీఎల్‌ ముగిశాక వెళ్లనున్నారు. ఆస్ట్రేలియాతో తలపడే భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అంచనా వేశాడు. జూన్ 7న బుధవారం నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఈ కీలక పోరు మొదలవుతుంది.

టీమిండియాలో వరల్డ్‌ క్లాస్‌ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు పేసర్లు, ఒక ఆల్ రౌండర్‌ ఉన్నారు. తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఓవల్ ట్రాక్ గట్టిగా, పొడిగా ఉంటే, ఇద్దరు స్పిన్నర్లు కచ్చితంగా ఆడాలని కోరుకుంటానన్నాడు. ఇంగ్లండ్‌లోని వాతావరణంతో ఇది చాలా బాగుంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఎండగా ఉందని.. కానీ, ఇంగ్లీష్ వాతావరణం ఎలా ఉంటుందో జూన్ నెలలో తెలుస్తుందని రవిశాస్త్రి తెలిపాడు.

ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు, ఓ ఆల్ రౌండర్‌తో భారత్‌ బరిలోకి దిగే చాన్స్‌ ఉందని రవిశాస్త్రి తెలిపాడు. ఇది మంచి కలయిక అవుతుందన్నాడు. ఆపై ఐదుగురు బ్యాట్స్‌మెన్స్, వికెట్ కీపర్ ఉంటారని, మొత్తం ఆరుగురు బ్యాట్స్‌మెన్స్ లిస్టులో ఉంటారన్నాడు. ఓవల్‌లో అన్ని పరిస్థితులూ సాధారణంగా ఉంటే.. ఇదే తన ఎంపిక అని పేర్కొన్నాడు. రవిశాస్త్రి చెప్పిన టీమ్‌ ప్రకారం.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటారు.

Read Also : Car Accident : అమెరికాలో కారు బోల్తా.. తెలంగాణ విద్యార్థి దుర్మ‌ర‌ణం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News