Akhil: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున విభిన్న పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన తనయుడు నాగ చైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చైతూ ఓ మోస్తరు విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతుండగా, అఖిల్ మాత్రం సరైన హిట్ కొట్టలేకపోతున్నాడు. అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణంగా ఫ్లాప్‌ని చవి చూసింది. ఈ మూవీ పోస్టర్స్ , టీజర్స్ చూసి అక్కినేని అభిమానులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అఖిల్ ఇండస్ట్రీ కి స్టార్ హీరో అవుతాడు అని అనుకున్నాడు. అఖిల్ కి ఒక రేంజ్ లో కష్టపడే మనస్తత్వం ఉంది, కానీ అదే సమయం లో ఆయనకీ దురదృష్టం కూడా వెంటాడుతూ వస్తుంది.
అందం , టాలెంట్ , డ్యాన్స్ మరియు ఫైట్స్ ఇలా స్టార్ హీరో అవ్వడానికి కావాల్సిన లక్షణాలు అన్నీఉన్నా కూడా అఖిల్‌కి మంచి హిట్ పడడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ చిత్రం కమర్షియల్ గా కనీసం 7 కోట్ల రూపాయిలు కూడా వసూలు చెయలేదు. దీంతో అఖిల్ ట్విట్టర్ లో ఎమోషనల్ ఒక ట్వీట్ వేసాడు. ఏజెంట్ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా నేను కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అంటూ తన నోట్ మొదలు పెట్టిన అఖిల్… మేమంతా ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నం చేసాం. అయితే మా దురదృష్టం కొద్దీ ఈ చిత్రాన్ని మేము అనుకున్న విధంగా వెండితెరపై అంతగా ఆవిష్కరించలేకపోయాం. ఏజెంట్ మూవీ నిర్మాత అనిల్ సుంకర గారికి నేను కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను,
ఆయన ప్రతి సందర్భంలో కూడా నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ గా నిలుస్తూ వచ్చారు.ఇక ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి మరియు మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా కి ప్రత్యేక కృతజ్ఞతలు. అభిమానులు చూపించే ప్రేమ మరియు ఉత్సాహం వల్లే మేము ఇలా సినిమాలు చేస్తున్నాం, కచ్చితంగా నేను మీ అందరి కోసం గ్రాండ్ కం బ్యాక్ అయితే ఇవ్వబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టాడు. అఖిల్ ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడంటే ఈ సారి పక్కా హిట్ కొడతాడేమి అని అందరు ముచ్చటించుకుంటున్నారు. అక్కినేని అఖిల్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ కేవలం తెలుగు, మలయాళం భాషల్లో మాత్రమే విడుదల చేశారు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని కన్నడ, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయలేకపోయారు.. సుమారు రూ. 65 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమాను వరల్డ్ వైడ్ గా 1100కు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది.